టాలీవుడ్ లో సమంతా కి ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ఒక విధంగా చెప్పాలంటే సమంత టాలీవుడ్ లేడీ సూపర్ స్టార్ అని చెప్పవచ్చు. అందరు హీరోయిన్స్ కి  ఆదర్శంగా నిలుస్తుంది సమంత. ఒక్క నటనలోనే కాదు ఫిట్నెస్ విషయంలో కూడా అందరికీ ఆదర్శంగా ఉంటుంది సమంత. అయితే నాగచైతన్య తో పెళ్ళై  అక్కినేని కోడలు గా మారిన తర్వాత సమంత క్రేజ్ ఎక్కడికో వెళ్ళి పోయింది. అంతేకాకుండా పెళ్లి తర్వాత సమంత చేసిన సినిమాలన్నీ బాక్సాఫీస్ దగ్గర మంచి విజయాన్ని అందుకున్నాయి. నాగచైతన్య తో చేసిన మజిలీ కూడా మంచి సక్సెస్ సాధించింది. 

 

 

 

 

 

 అయితే ప్రస్తుతం సమంత 96 సినిమా తెలుగు రీమేక్ లో నటిస్తుంది. తమిళ స్టార్ హీరో విజయ్ సేతుపతి, త్రిష జంటగా నటించిన ఈ సినిమాలో సమంత శర్వానంద్ నటిస్తున్నారు. కాగా ఈ సినిమాను తమిళంలో డైరెక్ట్ చేసిన జీ. ప్రేమ్ కుమార్  తెలుగులోనూ తెరకెక్కించారు. అయితే తాజాగా 96 మూవీ తెలుగు రీమేక్ సినిమా షూటింగ్ కంప్లీట్ అయినట్టు సమంత తన ఇన్స్టాగ్రామ్ ఖాతా ద్వారా తెలిపింది. ఈ సినిమాలోని పాత్రకు సంబంధించి కాస్త ఎమోషనల్ పోస్ట్ కూడా పెట్టింది సమంత. ఈ సినిమా నన్ను నేను బెటర్ గా చేసుకునేలా ఛాలెంజ్ చేసిన క్యారెక్టర్ అంటూ తెలిపింది సమంత. ఈ సినిమాని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు నిర్మిస్తున్నారు.

 

 

 

 

 

 అంతేకాకుండా వెబ్ సిరీస్ లో నటించడానికి కూడా అడుగులు వేస్తున్న సమంత... ది ఫ్యామిలీ మెన్ అనే వెబ్ సిరీస్ లో... విలన్ పాత్రలో కూడా నటించబోతున్నారని సమాచారం. అయితే కొన్ని సార్లు తనకు నెగటివ్ ఛాయలున్న పాత్రలు చేయడం అంటే చాలా ఇష్టం అని సమంత చెప్పిన విషయం కూడా తెలిసిందే. అంతేకాకుండా  వరుస సినిమా అవకాశాలు దక్కించుకుంటూ ముందుకు దూసుకుపోతోంది సమంత. ఒకప్పుడు గ్లామర్ పాత్రలో మెరిసిన సమంత... ఇప్పుడు కేవలం నటనకు ప్రాధాన్యం ఉండే వైవిధ్యమైన పాత్రలు ఎంచుకుంటూ తన నటనతో ప్రేక్షకుల మనసు దోచుకుంటుంది .

మరింత సమాచారం తెలుసుకోండి: