తెలుగులో టాప్ హీరోయిన్ అనగానే ఠక్కున గుర్తుకొచ్చే పేరు సమంత. ఏ మాయ చేశావే సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయమై అందరినీ మాయ చేసి తెలుగులో టాప్ హీరోయిన్ ప్లేన్ ని కైవసం చేసుకుంది. అందం, అభినయం కలగలిపి ఆమెని స్టార్ హీరోయిన్ ని చేశాయి. అక్కినేని నాగచైతన్యని పెళ్ళి చేసుకున్న తర్వాత సమంత సినిమాల్లో జోరు పెంచింది. అంతకుముందు కంటే ఇప్పుడు ఎక్కువ సినిమాల్లో నటిస్తుంది.


స్టార్ హీరోల కంటే తానేమీ తక్కువ కాదని " ఓ బేబి" సినిమా ద్వారా నిరూపించుకుంది. వరుస సినిమాలతో బిజీగా ఉన్న సమంత ప్రస్తుతం 96 సినిమాలో నటిస్తుంది. శర్వానంద్ హీరో తెరకెక్కుతున్న ఈ సినిమా తమిళంలో సూపర్ హిట్ అయిన 96 సినిమాకి రీమేక్. తమిళంలో హీరో హీరోయిన్లుగా త్రిష, విజయ్ సేతుపతి నటించారు. ఈ సినిమా తమిళంలో సూపర్ డూపర్ హిట్ అయింది. ఇందులో త్రిష నటనకి విమర్శకుల నుండి మంచి మార్కులు పడ్డాయి.


త్రిష "జాను" పాత్రలో చక్కగా ఒదిగిపోయింది. ఎక్కడ కూడా త్రిష కనిపించలేదు. ఒక సాధారణమైన "జాను"నే అందరూ చూశారు. ఒక పాత్ర జనాలకి అంతలా నచ్చిందంటే దాన్ని చేసిన వాళ్ళు ఆ క్యారెక్టర్ ని ఎంత ఓన్ చేసుకున్నారో అర్థం చేసుకోవచ్చు. అయితే ౯౬ తెలుగు రీమేక్ లో నటిస్తున్న సమంత త్రిష లా మాయ చేయగలదా అనే సందేహం మొదలైంది. సమంత ఈ మధ్య నటించిన సినిమాలని చూస్తే మజిలీ సినిమాలో "శ్రావణి" గా అందరినీ ఆకట్టుకుంది.


సమంత ఉండడం వల్లనే ఆ సినిమా అంతలా ఆడిందనే టాక్ కూడా ఉంది. అయితే మజిలీ శ్రావణి లాగా సినిమాలో జాను పాత్ర కూడా సిమిలర్ గా అలాగే ఉంటుందట. అందువల్ల సమంత త్రిషని బీట్ చేస్తుందనే అంటున్నారు. రీసెంట్ గా 96 మూవీలోని సమంత లుక్ ని రివీల్ చేశారు. ఈ లుక్ చాలా ఆసక్తికరంగా ఉంది. సి ప్రేమ్ కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాని వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు నిర్మిస్తున్నారు.






మరింత సమాచారం తెలుసుకోండి: