ప్రతి ఏడాది సంక్రాంతి సినిమాల పోరు ఆసక్తికరం. తెలుగుతో పాటు త‌మిళంలోనూ ఇంకా చెప్పాలంటే సౌత్ మొత్తం జరుపుకొనే అతిపెద్ద పండుగగా సంక్రాంతి ఉంది. తెలుగు, త‌మిళంలో అయితే సంక్రాంతి సినిమాల‌కు అతి పెద్ద సీజ‌న్‌. సంక్రాంతికి త‌మ సినిమాలు రిలీజ్ చేసేందుకు పెద్ద హీరోల నుంచి మీడియం రేంజ్ హీరోల వ‌ర‌కు పోటీ ప‌డుతుంటారు.


గ‌త నాలుగైదేళ్లుగా సంక్రాంతికి తెలుగులో మూడు- నాలుగు పెద్ద సినిమాలు పోటీ ప‌డుతున్నాయి. ఈ విష‌యంలో ఎవ్వ‌రు వెన‌క్కి త‌గ్గ‌డం లేదు. ఇంకా చెప్పాలంటే రెండు, మూడేళ్లు అన్ని సినిమాలు హిట్ అయ్యాయి. గ‌తేడాది మాత్రం మూడు సినిమాలు ప్లాప్ అయితే ఒక్క ఎఫ్ 2 మాత్ర‌మే హిట్ అయ్యింది. ఇక 2020 సంక్రాంతికి పోటీగా ఒకే రోజు జ‌న‌వ‌రి 12న మ‌హేష్ స‌రిలేరు నీకెవ్వ‌రు, బ‌న్నీ అల వైకుంఠ‌పురంలో ఖ‌ర్చీఫ్ వేసుకుని ఉన్నాయి. ఇక క‌ళ్యాణ్‌రామ్ ఎంత మంచివాడ‌వురాతో పాటు వెంకీ మామ కూడా లైన్లో ఉంది.


ఇదిలా ఉంటే కోలీవుడ్‌లో వ‌చ్చే సంక్రాంతికి ఏకంగా నాలుగు సినిమాలు ఖ‌ర్చీఫ్ వేసేశాయి. సూపర్ స్టార్ రజినికాంత్ - ఏ ఆర్ మురుగదాస్ దర్శకత్వంలో నటిస్తున్న దర్బార్ మూవీని సంక్రాంతికి విడుల చేస్తున్నట్లు చాలా నెలల క్రితమే ప్రకటించేశారు. ఇక విశాల్, తమన్నా నటించిన యాక్షన్ ఎంటర్టైనర్ యాక్షన్ మూవీ కూడా సంక్రాంతికి విడుదల చేస్తున్నారు. ఈ సినిమా టీజ‌ర్‌కు ఇప్ప‌టికే అదిరిపోయే రెస్పాన్స్ వ‌స్తోంది.


ఈ రెండు సినిమాల‌తో పాటు సూర్య , మోహన్ బాబు ప్రధాన పాత్రలలో తెరకెక్కుతున్న సురారై పోట్రు కూడా సంక్రాంతి బరిలోనే ఉంది. వీటితో పాటు కార్తీ నటిస్తున్న సుల్తాన్ అనే సినిమా కూడా సంక్రాంతి బ‌రిలోనే ఉంది. మ‌రి తెలుగు, త‌మిళ్‌లో ఏకంగా నాలుగేసి సినిమాలు రిలీజ్ అంటే మామూలు విష‌యం కాదు. ఇక ద‌ర్బార్ ఇటు తెలుగులో కూడా సంక్రాంతికే రానుంది. మ‌రి ఈ సినిమాల్లో ఏది పైచేయి సాధిస్తుందో ?  చూడాలి.



మరింత సమాచారం తెలుసుకోండి: