స్టార్ హీరోల మధ్య ఇగో సమస్యలు సర్వసాధారణం. అయితే మహేష్ అల్లు అర్జున్ ల మధ్య ఏర్పడ్డ ఇగో సమస్యలు వల్ల వీరిద్దరూ నటిస్తున్న సంక్రాంతి మూవీలు ‘సరిలేరు నీకెవ్వరు’ ‘అల వైకుంఠపురంలో’ మూవీల మధ్య అనవసరపు పోటీ ఏర్పడి ఈ సంక్రాంతి మార్కెట్ ను నమ్ముకుని 250 కోట్లు పెట్టుబడి పెట్టిన బయ్యర్లకు టెన్షన్ గా మారింది అంటూ కామెంట్స్ వస్తున్నాయి.

వాస్తవానికి మహేష్ బన్నీ సినిమాలు ఒకేరోజు విడుదల కావడం మహేష్ కు ఏమాత్రం ఇష్టం లేదు అని తెలుస్తోంది. దీనితో ఈ అనవసరపు పోటీని తప్పించి అవసరం అనుకుంటే బన్నీ సినిమాకు రెండు రోజులు ముందుగానే రావాలని మహేష్ భావించాడు. అయితే ఈ విషయమై ఎటువంటి రాయబారాలు అల్లు అర్జున్ వైపు నుండి రాకపోవడం మహేష్ ఇగో ను దెబ్బ తీసినట్లు టాక్. 

గతంలో ‘బాహుబలి’ పార్ట్ 1 విడుదల సమయంలో తన ‘శ్రీమంతుడు’ విడుదల అవుతున్న విషయాన్ని గ్రహించి స్వయంగా రాజమౌళి తనను అడిగినట్లుగా ఇప్పుడు బన్నీ నుంచి ఎదో ఒక రాయబారం వస్తుందని మహేష్ చివరి నిముషం వరకు భావించినట్లు తెలుస్తోంది. అయితే తనతో ఒక్కమాట కూడ చెప్పకుండా తన సినిమా రిలీజ్ డేట్ ను ప్రకటించడంతో మహేష్ ఇగో దెబ్బతిని తాను కూడ బన్నీతోటి అదేరోజున సంక్రాంతి పోరుకు రెడీ అని సిగ్నల్ ఇచ్చాడు అని అంటున్నారు.

దీనికితోడు కారణాలు తెలియకపోయినా కొంతకాలంగా బన్నీ మహేష్ ల మధ్య బయటపడని గ్యాప్ ఏర్పడింది అని తెలుస్తోంది. ముఖ్యంగా సుకుమార్ తో మూవీ చేసే విషయంలో మహేష్ ఆసక్తి కనపరుస్తున్నా తనతో ఒక్క మాట కూడ చెప్పకుండా బన్నీ సుకుమార్ ను తన వైపుకు లాక్కోవడం మహేష్ ఇగోను బాగా దెబ్బతీసింది అన్న గాసిప్పులు వినిపిస్తున్నాయి. ఇలాంటి సున్నితమైన కారణాలతో వీరిద్దరి మధ్య ఏర్పడిన గ్యాప్ ఇప్పుడు ఇగో సమస్యగా మారి సంక్రాంతి మార్కెట్ ను దెబ్బతీస్తోంది అంటూ కామెంట్స్ వస్తున్నాయి..   


మరింత సమాచారం తెలుసుకోండి: