నెగిటివ్ టాక్ అన్నది ఇపుడు ప్రతి సినిమాకు అలవాటు అయిపోయింది. వందల కోట్లు ఖర్చు పెట్టి తీసిన సినిమా ఇలా రిలీజ్ కాగానే అలా నెగిటివ్ టాక్ స్ప్రెడ్ అయిపోతోంది. దాంతో ఇదొక కొత్త కల్చర్ అంటోంది టాలీవుడ్. సినిమాలో సరుకు లేదని, పోయిందని మొదటి ఆట బొమ్మ పడకముందే దారుణంగా నెగిటివ్ కాంపైన్ స్టార్ట్ కావడంతో  ఆయా సినిమాల‌ జాతకం కొన్ని సందర్భాల్లో తిరగబడుతోంది.


మరి కొన్ని సందర్భాల్లో బలమైన కధానాయకుడు, భారీ అంచనాలు ఉన్నపుడు నెగిటివిటీ ఎంత ఉన్నా ఒకసారి చూద్దామన్న ట్రెండ్ కూడా బయల్దేరింది. దాంతో విపరీతమైన నెగిటివ్ టాక్ లో కూడా హిట్ అయిన సినిమాలు కొన్ని  కనిపిస్తున్నాయి. సాహో సినిమా అట్టర్ ఫ్లాప్ అని బాలీవుడ్ క్రిటిక్స్ దారుణంగా రాసి పారేశారు. సరిగ్గా అక్కడే నిలబడి సాహో 153 కోట్లు కొల్లగొట్టింది


ఇక మెగా కాంపౌండ్ హీరో వరుణ్ తేజ్ మూవీ గద్దలకొండ గణేష్ విషయంలో మొదటి నుంచి నెగిటివ్ టాక్ క్రియేట్ చేశారు. చివరికి నాలుగు గంటల్లో బొమ్మ పడుతుందనగా సినిమా పేరు  కూడా చేంజ్ చేశారు. అయినా కూడా ఈ మూవీ కలెక్షన్లు అదరగొట్టింది. ఏకంగా యాభై కోట్లకు పైగా షేర్ సాధించి వరుణ్ మూవీస్ లో బిగ్ హిట్ గా నిలిచినిది.


ఇక సైరా మూవీ విషయానికి వస్తే దాని మీద కూడా నెగిటివిటీ అలా ఇలా స్ప్రెడ్ కాలేదు. అయినా కూడా నిలిచి గెలిచాడు సైరా. ఏకంగా తెలుగు రాష్ట్రాల్లో వంద కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టి సైరా ఓకే అనిపించింది. చిరంజీవి తన స్టామినా ఎక్కడా తగ్గలేదని ప్రూవ్ చేసుకున్నాడు. ఇక ఈ మూవీ ఖైదీ నంబర్ 150 రికార్డులను కూడా కొన్ని చోట్ల క్రాస్ చేసింది. హైదరాబాద్ క్రాస్ రోడ్స్ లో ఓ ధియేటర్లో ఏకంగా  పది రోజులకు కోటి రూపాయలు వసూల్ చేసింది. మిగిలిన భాషల్లో మాత్రం సైరా ఊపు కంటిన్యూ చేయలేకపోయింది.


మరింత సమాచారం తెలుసుకోండి: