ఏం మాయ చేశావే సినిమాతో టాలీవుడ్ కి  ఎంట్రీ ఇచ్చిన సమంత ప్రేక్షకులను మాయ చేయడమే కాదు అటు నాగచైతన్య ను కూడా మాయ చేసింది. దీంతో తన మొదటి సినిమా నుంచే నాగచైతన్యతో లవ్ ట్రాక్ నడిపింది ఈ అమ్మడు. ఆ తర్వాత చాలా ఏళ్ళు ప్రేమలో మునిగిన తేలిన ఈ జంట  పెళ్లితో ఒక్కటయ్యారు . ఏ మాయ చేసావే సినిమా తర్వాత తన సినీ కెరీర్లో వెనక్కి తిరిగి చూడలేదు సమంత. స్టార్ హీరోల సరసన మెరిసి ఎన్నో విజయాలు అందుకుంది. మొదట్లో గ్లామర్ పాత్రలో నటించిన సమంత...పెళ్లి తర్వాత తన పంథా మార్చుకుంది.  పెళ్లి తర్వాత  నటనకు ప్రాధాన్యమున్న పాత్రల్లో నటిస్తూ... తన నటనతో ప్రేక్షకుల్ని మెప్పిస్తుంది సమంత. నాగచైతన్య పెళ్లి తర్వాత అక్కినేని కోడలు గా మారిన సమంత క్రేజ్ ఎక్కడికో వెళ్ళిపోయింది. ఇక పెళ్లి తర్వాత వరుస విజయాలతో దూసుకుపోతుంది సమంత. 

 

 

 

 

 సంవత్సరం ఇప్పటికే రెండు విజయాలను తన ఖాతాలో వేసుకుంది  సమంత. అయితే తన మొదటి సినిమాలోనే నాగచైతన్య తో జోడీ కట్టి  అందరినీ మాయ చేసిన సమంత...ఈ సంవత్సరం మజిలీ సినిమాతో మరోసారి నాగచైతన్య తో నటించి నటనతో అందరినీ మెప్పించింది. తర్వాత విడుదలైన ఓ బేబీ కూడా మంచి విజయం సాధించింది. అయితే తమిళంలో  మంచి విజయాన్ని అందుకున్న 96 రీమేక్ లో సమంత శర్వానంద్ తో జోడి గా  నటించనుంది . అయితే ఈ సినిమా షూటింగ్ తాజాగా కంప్లీట్  అయినట్టు సమంత వెల్లడించింది.

 

 

 

 టాలీవుడ్ ఇండస్ట్రీ నటులు మొత్తం కొత్త పుంతలు తొక్కుతున్నారు. రొటీన్ గా  సినిమాలు చేయడమే కాదు వెబ్ సిరీస్ లో కూడా నటించి ప్రేక్షకులను అలరిస్తున్నారు. ఈ కోవలోనే సమంతా కూడా కాస్త సినిమాలకు బ్రేక్ ఇచ్చి వెబ్ సిరీస్ లో నటించడానికి రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. అమెజాన్ ప్రైమ్ లో ప్రసారమయ్యే ది ఫ్యామిలీ మాన్ వెబ్ సిరీస్ సెకండ్ సీజన్ లో సమంత నటించబోతున్నట్లు సమాచారం. ఇప్పటికే ప్రసారమైన ఫస్ట్ సీజన్ మంచి టాక్ తెచ్చుకుంది. ఈ సీజన్లో మనోజ్ బాజ్పేయి,  ప్రియమణి, సందీప్ కిషన్ ప్రధాన పాత్రల్లో నటించి మెప్పించారు. కాగా ది ఫ్యామిలీ మాన్ వెబ్ సిరీస్ రెండో సీజన్లో సమంత ఓ ముఖ్య పాత్రలో నటించబోతోందని తెలుస్తుంది. తెలుగు దర్శకులైన రాజ్ నిడిమోరు,  కృష్ణా డికేలు ఈ వెబ్ సిరీస్ ku దర్శకత్వం వహిస్తున్నారు. అయితే ఈ వెబ్ సిరీస్ లో సమంత విలన్ పాత్రలో నటించబోతున్నారని సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: