సంక్రాంతి రేసుకు ‘సరిలేరు నీకెవ్వరు’ ‘అల వైకుంఠపురంలో’ మూవీలు గ్యాప్ లేకుండా జనవరి 12న విడుదల కావడానికి మహేష్ బన్నీల ఇగో సమస్యలు అంటూ ఇప్పటి వరకు భావించారు. అయితే ఇప్పుడు అసలైన కారణం వేరు అంటూ జనవరి 10 అంటే మహేష్ త్రివిక్రమ్ లకు ఉన్న భయం బన్నీ మహేష్ ల మధ్య డైరెక్ట్ వార్ కు కారణంగా మారింది అంటూ కొందరు వేరే కోణంలో విశ్లేషణలు చేస్తున్నారు. 

త్రివిక్రమ్ పవన్ కళ్యాణ్ తో తీసిన ‘అజ్ఞాతవాసి’ క్రితం సంవత్సరం జనవరి 10న విడుదలై ఘోరమైన ఫ్లాప్ గా మారడమే కాకుండా పవన్ కళ్యాణ్ కు సినిమాలంటే భయం కలగచేసేలా ‘అజ్ఞాతవాసి’ రిజల్ట్ ప్రభావితం చేసింది. అదేవిధంగా మహేష్ సుకుమార్ దర్శకత్వంలో ఎంతో కష్టపడి నటించిన ‘1 నేనొక్కడినే’ మూవీ 2014 జనవరి 10న
విడుదలై మహేష్ కెరియర్ లో అత్యంత భయంకరమైన ఫ్లాప్ గా మారింది. 

దీనితో మహేష్ త్రివిక్రమ్ లకు జనవరి 10 అంటే జీవితంలో మరిచిపోలేని పీడకల లా మారిన తేదీగా మారింది అని అంటారు. ఈ భయంతోనే జనవరి 10 అంటే అటు మహేష్ ఇటు త్రివిక్రమ్ ఇద్దరు భయపదిపోయారని అందువల్లనే జనవరి 12 ఆదివారం అయినప్పటికీ వీకెండ్ కలక్షన్స్ ను కూడ వదులుకుని తమ సినిమాలను విడుదల చేస్తూ జనవరి 10 భయంతో భారీ కలక్షన్స్ వచ్చే ఛాన్స్ ను పోగొట్టుకుంటున్నారు అంటూ కొందరు వీరి భయాల పై లోతైన విశ్లేషణ చేస్తున్నారు. 

దీనితో మహేష్ బన్నీల మధ్య వార్ ఇగో సమస్య వల్ల వచ్చిందా లేదంటే జనవరి 10 భయంతో ఏర్పడిందా అన్న విషయమై క్లారిటీ లేకపోయినా ఇప్పటి వరకు ఏ సంక్రాంతికి జరగని విషయంగా ఒక ఆదివారం రోజున ఇద్దరి టాప్ హీరోల సినిమాలు పోటీ పడటం ఒక కొత్త ట్రెండ్ కు శ్రీకారం చుడుతోంది అనుకోవాలి. దీనితో సాధారణంగా టాప్ హీరోల సినిమాలను బాగా చూసే ఓవర్సీస్ ప్రేక్షకులు ఎక్కువగా వీకెండ్ షోలకు వస్తారు కాబట్టి ఆ అవకాశాన్ని కూడ బన్నీ మహేష్ ల మూవీలు త్రివిక్రమ్ మహేష్ ల జనవరి 10 భయంతో జారవిడుచుకున్నారు అంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి..  


మరింత సమాచారం తెలుసుకోండి: