ప్రస్తుతం టాప్ హీరోల సినిమాల నుండి బాగా హిట్ అయిన చిన్న సినిమాల వరకు ఆ మూవీలు విడుదలైన నెల రోజులలో అమెజాన్ నెట్ ప్లిక్స్ లలో సందడి చేస్తున్న పరిస్థితులలో సినిమాకు అద్భుతమైన టాక్ వస్తే మినహా ప్రేక్షకులు మొదటి వారంలోనే ధియేటర్లకు రావడం మానివేశారు. ఇలాంటి పరిస్థితులు వల్ల సినిమా నిర్మాతలు ఘోరంగా నష్టపోతున్నారు.

అయితే టాప్ హీరోల సినిమాల పై బడ్జెట్ పెరిగి పోవడంతో పాటు ఆ మూవీ రిజల్ట్ పై గ్యారెంటీ లేకపోవడంతో చాలామంది నిర్మాతలు తమ సినిమాలను విడుదలకు ముందుగానే అత్యంత భారీ మొత్తాలకు అమెజాన్ నెట్ ప్లిక్స్ లకు అమ్మేసి భారీ నష్టాల భారీన పడకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అయితే ఇప్పుడు ఈ ట్రెండ్ కు అల్లు అర్జున్ త్రివిక్రమ్ లు ధైర్యం చేసి చెక్ పెట్టడం హాట్ న్యూస్ గా మారింది.

జనవరి 12న విడుదల కాబోతున్న ‘అల వైకుంఠపురంలో’ మూవీ అమెజాన్ నెట్ ప్లిక్స్ లలో కనిపించదని కేవలం ఈమూవీని ప్రేక్షకులు ధియేటర్స్ కు వచ్చి చూడాలని తెలుపుతూ ఈ మూవీ నిర్మాతలు ఒక అధికారిక పోస్టర్ ను విడుదల చేసారు. దీనితో అల్లు అర్జున్ ఒక లేటెస్ట్ ట్రెండ్ కు శ్రీకారం చుడుతున్నట్లు భావించాలి. వాస్తవానికి టాప్ హీరోల సినిమాల బిజినెస్ లో అమెజాన్ నెట్ ప్లిక్స్ హక్కులు ఛానల్స్ రైట్స్ కీలకంగా ఉంటాయి. 

ఇప్పుడు బన్నీ తీసుకున్న నిర్ణయంతో భవిష్యత్ లో టాప్ హీరోల నిర్మాతలు అందరూ ఇదే పద్దతిని అనుసరిస్తే నిర్మాతలకు వచ్చే ఆదాయం తగ్గి తద్వారా టాప్ హీరోల పారితోషికాలు కూడ తగ్గించు కోవలసిన పరిస్థితులు ఏర్పడుతాయి. అంతేకాదు కొన్ని అనుకోని పరిస్థితులలో ఒకే రోజున బన్నీ మహేష్ ల మూవీలు పోటీగా విడుదలవుతున్న నేపధ్యంలో బన్నీ సినిమా బయ్యర్లు భయపడి బ్యాక్ అవుట్ అవ్వకుండా ఈ సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నారా అన్న సందేహాలు కూడ వస్తున్నాయి.. 


మరింత సమాచారం తెలుసుకోండి: