ఈతరం హీరోలందరికి స్పూర్తి అంటే మెగాస్టార్ చిరంజీవి మాత్రమే. చిరుని చూసే హీరో అవ్వాలని అనుకున్నా అనే డైలాగ్ చాలా కామన్ అయ్యింది. అప్పట్లో హీరో అంటే చిరంజీవే అన్నట్టుగా ఆయన సినిమాలు ఉండేవి. యువతరం మొత్తం చిరు మాయలో పడ్డారు. అయితే ఆ మాయ నుండి బయటపడలేని వారు తాను కూడా చిరంజీవిలా హీరో అవ్వాలనే ఇండస్ట్రీ బాట పట్టారు. 


అలాంటి వారిలో తాను కూడా ఒకడిని అంటున్నాడు ఎవ్వరికి చెప్పొద్దు హీరో రాకేష్. జోష్, వేదం, బద్రినాథ్, మిర్చి, బాహుబలి, జై లవ కుశ, గూఢచారి వంటి సినిమాల్లో నటించి మెప్పించిన రాకేష్ హీరోగా చేసిన తొలి ప్రయత్నం ఎవ్వరికీ చెప్పొద్దు. ఈ సినిమాలో మరో విశేషం ఏంటంటే హీరోగానే కాదు ఈ సినిమా నిర్మించింది కూడా రాకేషే.


చిన్న చిన్న పాత్రలు చేస్తూ వస్తున్న రాకేష్ హీరోగా తనకు ఎవరు ఛాన్స్ ఇవ్వరని అనుకున్నాడో ఏమో అతనే నిర్మాతగా మారి ఈ మూవీ చేశాడు. శంకర్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా ఫ్రైడే రిలీజై మంచి టాక్ సొంతం చేసుకుంది. ఈ సినిమా నిర్మాతగా మారినందుకు దిల్ రాజు తనని అరచారని చెప్పాడు రాకేష్.


అంతేకాదు చిన్నప్పటి నుండి సినిమాలంటే ఇష్టమని.. మెగాస్టార్ చిరంజీవిని చూసి హీరో అవ్వాలని ఫిక్స్ అయినట్టు చెప్పారు. జగదేకవీరుడు అతిలోకసుందరి సినిమాను 60 సార్లు చూశానని రాకేష్ అన్నారు. మొత్తానికి హీరోగా రాకేష్ తొలి ప్రయత్నం మెప్పించిందని చెప్పొచ్చు. దిల్ రాజు ప్రొడక్షన్ లో మొదట అవకాశం తెచ్చుకున్న రాకేష్ తను నిర్మించిన ఈ సినిమాను కూడా దిల్ రాజు ద్వారా రిలీజ్ చేయించాడు. హీరోగా చేశాడు కాబట్టి ఇక సైడ్ క్యారక్టర్స్ వదిలేస్తాడా అన్న డౌట్ రాక మానదు. హీరోగా చేసినా వేరే హీరోల సినిమాల్లో ఎలాంటి పాత్ర అయినా చేస్తా అంటున్నాడు రాకేష్. 


మరింత సమాచారం తెలుసుకోండి: