టాలీవుడ్ లో శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన ‘హ్యాపీ డేస్’ మూవీతో హీరోగా పరిచయం అయ్యాడు నిఖిల్.  ఈ మూవీతో వరుణ్ సందేశ్, నిఖిల్ తర్వాత హీరోలుగా నటించారు. వరుణ్ సందేశ్ హీరోగా సక్సెస్ కాకపోవడంతో సినిమాలకు దూరంగా ఉంటూ వచ్చారు.  ప్రస్తుతం బిగ్ బాస్ 3 లో హీరో వరుణ్ సందేశ్ ఆయన సతీమణి వితిక కంటిస్టెట్లుగా గట్టి పోటీ ఇస్తున్నారు.  ఇక  నిఖిల్ తర్వాత నటించిన సినిమాలు ఒకటీ రెండు పెద్దగా హిట్ కాకపోయినా..కలర్స్ స్వాతి హీరోయిన్ గా నటించిన ‘స్వామిరారా’ మనోడి జాతకాన్ని పూర్తిగా మార్చేసింది. 

ఆ తర్వాత వచ్చిన కార్తికేయ, సూర్య వర్సెస్ సూర్య, ఎక్కడికి పోతావు చిన్నవాడ, కేశవ లాంటి సినిమాలు మంచి సక్సెస్ అయ్యాయి. గత ఏడాది 'కిర్రాక్ పార్టీ' డిజాస్టర్ తో నిఖిల్ మూవీస్ కి చాలా గ్యాప్ వచ్చింది.  వాస్తవానికి ముద్ర సినిమాలో నటించాడు..అయితే ఆ మూవీ టైటిల్ వివాదం రావడం..తర్వాత టైటిల్   ‘అర్జున్ సురువరం’ మార్చారు.  అయితే ఈ మూవీ రిలీజ్ కూడా ఎన్నో ఆటంకాలు ఎదుర్కొంటుంది. 

తాజాగా నిఖిల్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ..కెరీర్ బిగినింగ్ లో కొంత మందికి డబ్బులు ఇచ్చి దారుణంగా మోసపోయానని చెప్పాడు.  తనకు సినిమాల్లో వేషం ఇస్తామని చెప్పగా..5 లక్షలు, రూ.10 లక్షలు అడిగారని చెప్పారు. అయితే సినిమాలపై ఇష్టంతో తన తండ్రిని రిక్వెస్ట్ చేసి వారికి డబ్బు సమకూర్చానని అన్నారు. అయితే కొన్ని సన్నివేశాలు తనపై చిత్రీకరించి తర్వాత కంటికి కనిపించకుండా పోయారని ఆవేదన చెందాడు. కాకపోతే ఇప్పుడు తనకు అటువంటి పరిస్థితులేవీ ఎదురు కావడం లేదని చెప్పుకొచ్చాడు.


మరింత సమాచారం తెలుసుకోండి: