బిగ్ బాస్ హౌస్ లో చాలా పొగరుగా రాహుల్ కి చాలా క్లోజ్ గా హౌస్ లో దాదాపు 11 వారాలు ఉన్న పునర్నవి గత వారం బిగ్ బాస్ హౌస్ నుండి ఎలిమినేట్ కావటం జరిగింది. దీంతో పునర్నవి బయటకు వెళ్లిపోవడంతో హౌస్ లో ఉన్న రాహుల్ కూడా కంటతడి పెట్టడం జరిగింది. అదే క్రమంలో పునర్నవి కూడా కొంత భావోద్వేగానికి గురైంది. ఇదిలా ఉండగా తాజాగా హౌస్ నుండి బయటకు వచ్చిన పునర్నవి హౌస్ లో ఉన్న తన స్నేహితులకు ఒకపక్క క్యాంపెయిన్ చేస్తూ మరోపక్క ఫుల్లుగా ఎంజాయ్ చేస్తోంది.


తాజాగా ఆమె తన అన్నతో కలిసి ఎంజాయ్ చేస్తున్న ఫోటోలను ఇంస్టాగ్రామ్ లో అప్లోడ్ చేసి తన ఆనందాన్ని పంచుకుంది. ఉయ్యాల జంపాల సినిమాలో హీరోయిన్ స్నేహితురాలిగా నటించిన పునర్నవి తెలుగు ప్రేక్షకుల హృదయాలను ఆ సినిమాతో దోచుకుంది. ఆ తర్వాత శర్వానంద్ నటించిన సినిమా హీరో కూతురు గా నటించింది. ఇదిలా ఉండగా తాజాగా పునర్నవి అర్జున్ రెడ్డి డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో సినిమా చేయడానికి అవకాశం దక్కించుకున్నట్లు ఫిలింనగర్లో వార్తలు వినబడుతున్నాయి.


దీంతో ఈ వార్త సోషల్ మీడియాలో రావడంతో చాలా మంది నెటిజన్లు ఇదంతా బిగ్ బాస్ హౌస్ క్రేజ్ వల్ల వచ్చింది అని అంటున్నారు. మరి కొంతమంది అయితే అదిరిపోయే ఆఫర్ పునర్నవి కి దక్కిందని...సినిమాల్లో క్లిక్ అయితే పునర్నవి నీ ఇక ఆపలేరు అంటూ కామెంట్ చేస్తున్నారు. కాగా ప్రస్తుతం బిగ్ బాస్ షో చివరి దశకు చేరుకుంటున్న నేపథ్యంలో...తన ఫ్రెండ్స్ రాహుల్, వరుణ్, వితిక లా కోసం గెలుపు కోసం తెగ కష్టపడుతుంది. ముఖ్యంగా రాహుల్ కోసం తనకి ఫాలో అవుతున్న ప్రతి ఒక్కరిని రాహుల్ ని గెలిపించాలని కోరుకుంటుంది.



మరింత సమాచారం తెలుసుకోండి: