వెబ్‌సిరీస్‌ ఒక ట్రెండ్ గా మారిపోయింది. సినిమాలకు ఎలాగయితే క్రేజ్ ఉందో ఇప్పుడు అదే తరహాలో వెబ్‌సిరీస్‌ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోయింది. ప్రస్తుతం దీని  ట్రెండ్ నడుస్తోంది. సినిమాలలో విజయం సాధించలేని చాలమంది నటి,నటులు వెబ్‌సిరీస్‌  ప్లాటుఫారంగా  మార్చుకొని  విజయం సాదిస్తున్నారు. ఈ వెబ్‌సిరీస్‌ ఎపిసోడ్లుగా, ఒక్కో ఎపిసోడ్‌ 20 నిమిషాల నిడివితో రూపొందిస్తారు.  తాజాగా  ‘భజన బ్యాచ్‌’ అనే వెబ్‌సిరీస్‌ని   దర్శకుడు చిన్నికృష్ణ రూపొందించారు.


‘ప్యారాషూట్‌ లేకుండా మనిషిని గాల్లో తేలగలిగేలా చేసేది పొగడ్త. దానికి పడని వాళ్లు ఉండరు,  అలాంటి పొగడ్తనే ప్రవృత్తిగా పెట్టుకున్న ఒక కుటుంబానికి సంబంధించిన కథే మా ‘భజన బ్యాచ్‌’ సిరీస్‌. ఈ సిరీస్‌ను 12 ఎపిసోడ్లుగా, ఒక్కో ఎపిసోడ్‌ 20 నిమిషాల నిడివితో రూపొందించాం.  ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తుంది’’ అన్నారు దర్శకుడు చిన్నికృష్ణ. దర్శకుడు మారుతి ఇచ్చిన కాన్సెప్ట్‌ ఆధారంగా చిన్నికృష్ణ రూపొందించిన వెబ్‌సిరీస్‌ ‘భజన బ్యాచ్‌’.


దర్శకుడు చిన్నికృష్ణ ‘వీడు తేడా, బ్రదర్‌ ఆఫ్‌ బొమ్మాళి, లండన్‌ బాబులు’ సినిమాలకు దర్శకత్వం వహించారు. ప్రస్తుతం ఈయన  తెరకెక్కించిన ‘అక్షర’ సినిమాని ఈ నెలాఖరులో  విడుదల చేయనున్నారు.. పోసాని కృష్ణమురళి, గెటప్‌ శ్రీను, జెమిని సురేశ్‌ ముఖ్య పాత్రల్లో నటించారు. చిన్నా వాసుదేవ రెడ్డి నిర్మించారు.  పొగడ్తల ద్వారా జీవితం సాగిస్తారు పోసాని. వాళ్ల పిల్లలను కూడా ఇదే వృత్తిని కొనసాగించమనడంతో తన పిల్లలు కూడా భజన చేయడం మొదలుపెడతారు.


ఒక్కో ఎపిసోడ్‌లో ఒక్కొక్కరి చుట్టూ చేరి భజన చేస్తారు. వాళ్ల స్టయిల్‌ కామెడీ ఇందులో ఉంటుంది. ఈ వెబ్‌ సిరీస్‌ ప్రస్తుతం సోనీ లైవ్‌లో ప్రసారం అవుతోంది. వినాయక్‌గారిని నటుడిగా అవకాశం అడిగితే రైటింగ్‌ టీమ్‌లోకి తీసుకున్నారు. ఆయన వద్ద ‘కృష్ణ, అదుర్స్‌’ సినిమాలకు వర్క్‌ చేశాను.. ‘కొత్తబంగారు లోకం, ఖైదీ నంబర్‌ 150’ వంటి సినిమాల్లో చిన్న పాత్రల్లో కనిపించాను. దర్శకులకు సినిమా సినిమాకు చిన్న గ్యాప్‌ రావడం సహజం. ఇకపై ఆ గ్యాప్‌లో  వెబ్‌ సిరీస్‌లు చేయాలనుకుంటున్నాను దర్శకుడు చిన్ని కృష్ణ చెప్పుకొచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి: