తెలుగు సినిమాల్లో చాలా మార్పొచ్చింది. సినిమా కథ విషయంలోనూ, కథని ప్రేక్షకులని నచ్చేట్టుగా చెప్పడంలోనూ మన వాళ్ళు ముందుంటున్నారు. ఈ మధ్య వచ్చిన ప్రతీ సినిమా బాలీవుడ్ రీమేక్ కి వెళ్తుందంటేనే అర్థం చేసుకోవచ్చు మన వాళ్ళు ఏ రేంజ్ లో ఉన్నారో. మొన్నటికి మొన్న షాహిద్ కపూర్ నటించిన "కబీర్ సింగ్" సినిమా ఎంత పెద్ద విజయం సాధించిందో అందరికీ తెలిసిందే.


మూడు వందల కోట్లకి పైగా కలెక్షన్లని వసూలు చేసి షాహిద్ కపుర్ కెరీర్లో హయ్యెస్ట్ గ్రాసర్ గా నిలిచింది. ఈ సినిమా తెలుగులో విజయం సాధించిన అర్జున్ రెడ్డికి రీమేక్. తెలుగు అర్జున్ రెడ్డికి దర్శకత్వం వహించిన సందీప్ రెడ్డి వంగా హిందీలో దర్శకత్వం వహించాడు. ఈ సినిమాపై  ఎన్నో విమర్శలు వచ్చినప్పటికీ కలెక్షన్లలో జోరు మాత్రం తగ్గలేదు. ఈ సినిమాతో షాహిద్ కపూర్ కి సూపర్ స్టార్ స్థాయి వచ్చిందనే చెప్పవచ్చు.


అయితే ఇదిలా ఉంచితే ప్రస్తుతం షాహిద్ కపూర్ మరో తలుగు సినిమాని రీమేక్ చేస్తున్నాడట. తెలుగులో విజయం సాధించిన సెన్సిబుల్ ఫిలిమ్" జెర్సీ" ని హిందీలో షాహిద్ కపూర్ హీరోగా రీమేక్ చేయనున్నారని సమాచారం. జెర్సీ సినిమాలో నాని హీరోగా నటించాడు. ఈ సినిమాలో నాని నటనకి విమర్శకుల నుండి మంచి మార్కులు పడ్డాయి. అయితే ఈ హిందీ రీమేకి కి దర్శకులుగా తెలుగు జెర్సీకి దర్శకత్వం వహించిన గౌతమ్ తిన్ననూరినే కావడం విశేషం.


చాలా రోజుల తర్వాత తెలుగులో ఒక సెన్సిబుల్ దర్శకుడు దొరికాడని అందరూ అనుకున్నారు. ఆ దర్శకుడు ఇప్పుడు బాలీవుడ్ కి కూడా పరిచయం కాబోతున్నాడు. ఒక తెలుగు సినిమా రీమేక్ ద్వారా కెరీర్ హయ్యెస్ట్ గ్రాసర్ ని సాధించిన షాహిద్ కపూర్ మరో తెలుగు రీమేక్ ద్వారా ఎలాంటి విజయం సాధిస్తాడో చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: