కొత్త సినిమా చూడాలంటే థియేట‌ర్‌కే వెళ్లాలా? వెబ్ సిరీస్‌లు, టీవీ షోలు అన్నీ ఒకే ఫ్లాట్‌ఫామ్‌పై చూడ‌లేమా? న‌్యూస్ చాన‌ల్స్ అన్నీ ఒకే చోటికి రాలేవా? ఇవ‌న్నింటికీ ప‌రిష్కారం చూపేందుకు వ‌చ్చేసింది 'హైఫ్లిక్స్ డాట్ కం'. ఇండియాలోనే తొలిసారిగా ఫ్రీ స‌బ్‌స్క్రిప్ష‌న్ అందిస్తూ బోలెడంతా ఎంట‌ర్‌టైన్‌మెంట్ అందించ‌బోతోంది ఈ వెబ్‌సైట్, యాప్. మూవీ మేక‌ర్ల‌కు మేలు చేసేలా కొత్త సినిమాల‌ను కూడా విడుద‌ల చేస్తూ స‌రికొత్త ట్రెండ్‌ని తీసుకువ‌స్తోంది  'హైఫ్లిక్స్'.


థియేటర్‌లో చూడటం వీలుపడని సినిమాను టీవీలో వీక్షించాలంటే గతంలో చాలా రోజులు వేచి చూడాల్సి వచ్చేది. తీరా ఆ సినిమా టీవీలో ప్రసారమయ్యే రోజున మ‌న‌కు చూడ‌టం కుద‌ర‌క‌పోవ‌చ్చు. కానీ  'హైఫ్లిక్స్' రంగ ప్రవేశం తర్వాత సీన్ మార‌నుంది. ప్రాంతీయ‌ సినిమాల‌తోపాటు.. వెబ్‌ సిరీస్‌లు, షార్ట్‌ ఫిల్మ్స్‌, న్యూస్ చాన‌ల్స్ చూడ‌వ‌చ్చు. పైగా, మ‌న‌కు వీలున్న సమయంలో వీక్షించే వెసులుబాటు ఉంటుంది. hyflix.com వెబ్‌సైట్‌, యాప్ ద్వారా టీవీలో లేదంటే మొబైల్‌లోనూ చూడగలిగే సౌకర్యం.


యూజ‌ర్ల‌కు స‌బ్‌స్క్రిప్ష‌న్ ఉచితంగా అందిస్తూ కొత్త సినిమాల‌కు మాత్ర‌మే నామ‌మాత్ర చార్జీల‌తో మూవీ టికెట్‌లు ప్ర‌వేశ‌పెట్టింది  'హైఫ్లిక్స్ డాట్ కం'. సినీ ల‌వ‌ర్స్‌కు-మూవీ మేక‌ర్స్‌కు స‌రికొత్త ట్రెండ్‌ను తీసుకువ‌చ్చిన ఈ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్, ఇండ‌స్ట్రీలో హాట్ టాపిక్‌గా మారుతోంది. మొత్తానికి 'హైఫ్లిక్స్' స‌రికొత్త సినీవిప్లవానికి తెరలేపుతోంద‌న్నమాట. టెక్నాల‌జీ పెరిగేకొద్ది ఎన్నో ప‌నులు సులువుగా అయిపోతున్నాయి. అంతే కాక మొత్తం ప్ర‌పంచం మ‌న చేతుల్లోనే ఉంటుంది. మ‌నం ఎప్పుడు ఎక్క‌డ ఉన్నా ఏది కావాల‌న్నాచాలా సులువుగా చేసుకుంటున్నాం. అంటే అదంతా మ‌నం వాడే టెక్నాల‌జీ వ‌ల్ల‌నే.అదే టెక్నాల‌జీతో మ‌నం ఎంతో ఎంట‌ర్‌టైన్మెంట్ని కూడా ఆశ్వాదించ‌గ‌లుగుతున్నాము. కొత్త సినిమాల‌ను కూడా ఇప్పుడు మ‌న ఫోన్‌లోనే చూడ‌గ‌లిగేంత‌గా టెక్నాల‌జీ పెరిగింది.  హైఫ్లిక్స్ ద్వారా ఇప్పుడు అవ‌కాశం క‌లిగింది.


మరింత సమాచారం తెలుసుకోండి: