టాలీవుడ్ లో ఈ మద్య కొత్త హీరోయిన్లు తమ స్కిన్ షో తో బాగా ఆకట్టుకుంటున్నారు.  నటన విషయం పక్కనబెడితే శృంగార సన్నివేశాలు, లిప్ లాక్, బెడ్ రూమ్ సీన్లు, ఇక బీచ్ సీన్ల గురించి చెప్పాల్సిన అవసరమే లేదు..రెచ్చిపోయి మరీ నటిస్తున్నారు.  అయితే ఎన్ని అందాలు చూపించినా కొద్ది మంది హీరోయిన్లు మాత్రమే సినీ పరిశ్రమలో కొద్ది కాలం ఉంటున్నారు. 

నన్నుదోచుకుండువటే మూవీలో సుధీర్ బాబు సరసన నటించిన నభా నటేష్  ఈ మద్య పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రామ్ హీరోగా నటించిన ‘ఇస్మార్ట్ శంకర్’ మూవీతో మంచి సక్సెస్ సాధించింది.  ఈ మూవీలో గ్లామర్ పరంగా తన అందాల ఆరబోతతో బాగా ఆకట్టుకుంది. యూత్ కి హార్ట్ బీట్ ని పెంచే హీరోయిన్ గా నభా నటేష్   కెరియర్ టాప్ గేర్ కి పడింది. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన 'ఇస్మార్ట్ శంకర్' బాక్సాఫీస్‌ను షేక్ చేసిన విషయం తెలిసిందే. హీరో రామ్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచి కలెక్షన్‌ల మోత మోగించింది.

ఇక ఈ సినిమాలో హీరోయిన్లుగా నటించిన నిధి అగర్వాల్‌, నభా నటేష్‌లు ప్రస్తుతం వారి కెరీర్‌లో దూసుకపోతున్నారు.  తాజాగా సాయిధరమ్ తేజ్ తో ‘సోలో బ్రతుకే సో బెటర్’  మాస్ మహారాజ రవితేజ తో  ‘డిస్కో రాజా’ మూవీలో నటిస్తుంది.  నభా ఈవెంట్స్ కి స్పెషల్  అట్రాక్షన్ గా మారుతుంది. ఈ రెండు మూవీలు సక్సెస్ అయితే ఈ కన్నడ బ్యూటీ కొంత కాలం తెలుగు లో రాణించగలుగుతుంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏ ఈవెంట్ కి అయినా నభా ఫస్ట్ ఆప్షన్ అయ్యింది. లేటెస్ట్ గా తాను  మెర్సిడస్ బెంజ్   కారు తో దిగిన ఫోటోలు హల్ చల్ చేస్తున్నాయి. తాజాగా తన అందాల ఆరబోతతో సోషల్ మీడియాలో పిచ్చెక్కించే ఫోటో అప్ లోడ్ చేసింది. 


మరింత సమాచారం తెలుసుకోండి: