ఆమె ఒక సీనియర్ స్టార్ హీరోయిన్.. తెలుగు, తమిళ భాషల్లో దశాబ్ధ కాలంగా సినిమాలు చేస్తూ స్టార్స్ అందరితో నటించిన సీనియర్ హీరోయిన్. అయితే ఈమధ్య పూర్తి ఫాం కోల్పోయినట్టు కనిపించినా స్టార్ సినిమాల్లో ఏ చిన్న పాత్ర అయినా చేసేస్తుంది. ఇక ఆమెకున్న ప్లస్ పాయింట్ ఇప్పటికి డ్యాన్స్ బాగా వేస్తుంది.


అందుకే సినిమా ఈవెంట్ లలో ఆమెతో డ్యాన్సులు వేయిస్తుంటారు. సినిమాల్లో కనిపించకున్నా ఇలా ఈవెంట్ లలో కనిపిస్తూ అలరిస్తుంది ఆ హీరోయిన్. ఇదంతా పక్కన పెడితే ఇప్పుడు ఆ హీరోయిన్ కు కొత్తగా సిగరెట్ తాగడం అలవాటు అయ్యిందట. ఇదవరకు ఉన్నా దాచి పెట్టిందో లేక ఈమధ్యనే అలవాటు చేసుకుందో కాని ఆమె సిగరెట్ తాగడం ఓ యూనిట్ మెంబర్ చూశాడట.


ఇప్పటికే హీరోయిన్ గా ఛాన్సులు రాక గెస్ట్ అప్పియరెన్స్ లంటూ చేసుకుంటూ కాలం వెళ్లదీస్తున్న ఈ అమ్మడు సిగరెట్ తాగుతుందని విషయం అందరికి షాక్ ఇచ్చిందట. రీసెంట్ గా ఓ ఈవెంట్ దగ్గర కూడా ఆమె పబ్లిక్ గా సిగరెంట్ తాగడం ఒక్రు ఫోటో తీశారట. అయితే ఎలాగోలా ఆ ఫోటో తీసింది యూనిట్ మెంబరే కావడంతో అది బయటకు పొక్కకుండా చేశారు.   


అయితే ఫేడవుట్ అయిన ఈ అమ్మడికి కొత్తగా సిగరెట్ తాగడం ఎలా అలవాటు పడ్డదో కాని ఇప్పటి వరకు ఆమెను ఆరాధించిన ఆమె ఫ్యాన్స్ కు.. ఫాలోవర్స్ కు ఈ విషయం తెలిస్తే మాత్రం చాలా అప్సెట్ అవుతారని చెప్పొచ్చు. అందుకే హీరోయిన్ సిగరెట్ తాగుతున్న విషయం తెలిసిన కొందరు సన్ణితులు ఆమెని హెచ్చరిస్తున్నారట. మొత్తానికి స్టార్ సీనియర్ హీరోయిన్ కు ఈ ఏజ్ లో కొత్తరకం అలవాట్లు చూసి ఆశ్చర్యపడుతున్నారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: