మెగాస్టార్ చిరంజీవి తొలిసారి ఒక స్వాంత్ర్యోద్యమ వీరుడిగా నటించిన తాజా సినిమా సైరా నరసింహారెడ్డి ఇటీవల గాంధీ మహాత్ముని 150వ జయంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. యువ దర్శకుడు సురేందర్ రెడ్డి దర్శకత్వం వచ్చిన ఈ సినిమాని మెగాస్టార్ తనయుడు రామ్ చరణ్, అత్యంత భారీ ఖర్చుతో నిర్మించడం జరిగింది. కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ బ్యానర్ పై నిర్మితం అయిన ఈ సినిమాలో మెగాస్టార్ సరసన నయనతార హీరోయిన్ గా నటించగా మరొక హీరోయిన్ గా తమన్నా మరియు ప్రత్యేక పాత్రల్లో అనుష్క శెట్టి, నిహారిక కొణిదెల నటించడం జరిగింది. అమితాబ్ బచ్చన్, సుదీప్, విజయ్ సేతుపతి, జగపతి బాబు వంటి దిగ్గజ నటులు నటించిన ఈ సినిమాపై ప్రేక్షకులు ఎన్నో అంచనాలు పెట్టుకున్నప్పటికీ, 

రిలీజ్ తరువాత సినిమా ఆ అంచనాలు అందుకోలేక ఓవర్ ఆల్ గా యావరేజ్ టాక్ ని సంపాదించింది. ఇక ప్రస్తుతం అత్యంత పేలవంగా ముందుకు సాగుతున్న ఈ సినిమా, నార్త్ లో మరింత దీనమైన కలెక్షన్స్ ని సాదిస్తుననట్లు చెప్తున్నారు ట్రేడ్ విశ్లేషకులు. నిజానికి ఈ సినిమాకు అక్కడ తొలిరోజు పర్వాలేదనిపించేలా రివ్యూస్ వచ్చినప్పటికీ, అదే రోజున హృతిక్, టైగర్ ల వార్ సినిమా కూడా రిలీజ్ అయి మంచి సక్సెస్ సాధించడం, ఆ తరువాత పలు సినిమాలు కూడా రిలీజ్ కావడంతో, సైరా కు భారీగా గండి పడ్డట్లు తెలుస్తోంది. ఇక నిన్నటితో పది రోజులు పూర్తిచేసుకున్న ఈ సినిమా, అక్కడ ఆల్మోస్ట్ దుకాణం సర్దేసినట్లు చెప్తున్నారు. ఈ సినిమా హిందీ హక్కులను ప్రముఖ బాలీవుడ్ హీరో, నిర్మాత ఫర్హాన్ అక్తర్ కొనుగోలు చేశారు. ఫర్హాన్ అక్తర్, రితేష్ సిద్వానికి చెందిన ఎక్సెల్ ఎంటర్‌టైన్మెంట్, అనిల్ తాదానికి చెందిన ఎఎ ఫిల్మ్స్‌ సంయుక్తంగా ‘సైరా’ హక్కులను భారీ ధరకు కొనుగోలు చేశాయి.

గతంలో కేజీఎఫ్ సినిమాని కొని, భారీగా లాభాలు చూసిన ఈ సంస్థ, సైరాతో మాత్రం భారీగా నష్టాలు చవిచూసే పరిస్థితి కనపడుతోందట. విడుదలైన పది రోజుల్లో ఈ సినిమాకు కేవలం రూ.7 కోట్లు మాత్రమే నెట్ కలెక్షన్ ని రాబట్టిందని, ఇక రాబోయే మరికొద్ది రోజుల్లో మహా అయితే మరొక రూ.1 కోటి రూపాయలు రాబట్టి, మొత్తంగా రూ. 8 కోట్ల రూపాయల వరకు మాత్రమే దక్కించుకునే అవకాశం కనబడుతోందని అంటున్నారు. ఇప్పటికే తెలుగు రాష్టాల్లో కూడా అక్కడక్కడా కొంత మేర దెబ్బతిన్న ఈ సినిమా, నార్త్ లో కూడా బాగానే నష్టాలు మిగులుస్తోంది.....!!


మరింత సమాచారం తెలుసుకోండి: