టాలీవుడ్ దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఇటీవల బాహుబలి మరియు బాహుబలి 2 సినిమాలు ఎంత గొప్ప విజయాలు అందుకున్నాయో తెలిసిందే. ఇక ఆ సినిమాల అద్భుత విజయాల తరువాత, ప్రస్తుతం ఎన్టీఆర్ మరియు రామ్ చరణ్ హీరోలుగా రాజమౌళి తెరకెక్కిస్తున్న తాజా సినిమా ఆర్ఆర్ఆర్. డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై డివివి దానయ్య, రూ.450 కోట్ల భారీ వ్యయంతో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ఈ భారీ మల్టి స్టారర్ పై మన దేశంతో పాటు పలు ఇతర దేశాల్లోని మూవీ లవర్స్ లో కూడా మంచి అంచనాలు నెలకొని ఉన్నాయి. ఇటీవల బల్గెరియాలో ఒక పెద్ద షెడ్యూల్ జరుపుకున్న ఈ సినిమా, కొద్ది రోజులుగా హైదరాబాద్ లో తాజా షెడ్యూల్ షూటింగ్ జరుపుకుంటోంది. అయితే ఈనెల 19న బాహుబలి సినిమాకు లండన్ లో స్పెషల్ స్క్రీనింగ్ ఉండడంతో, 

ఆర్ఆర్ఆర్ షూటింగ్ ని కొద్దిరోజుల పాటు వాయిదా వేసినట్లు సమాచారం. అయితే ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ సాగుతున్న విధానాన్ని బట్టి చూస్తుంటే, అనుకున్న విధంగా ఈ సినిమా వచ్చే ఏడాది జులై 30న రావడం చాలావరకు కష్టం అని అంటున్నారు కొందరు. ఇక వారు చెప్తున్న ప్రకారం, ఇప్పటికే పలుమార్లు వాయిదా పడిన ఈ సినిమా, అందుతున్న సమాచారం ప్రకారం, వచ్చే ఏడాది జూన్ వరకు షూటింగ్ జరుపుకునే అవకాశాలు కనపడుతున్నాయట. దాని తరువాత పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలకు మరొక మూడు నెలల వరకు సమయం పడుతుందని, అయితే దానిని బట్టి జులై తరువాత వచ్చే అతి పెద్ద పండుగ దసరా ఉన్నప్పటికీ, ఆ సమయంలో రాజమౌళి తన సినిమాను విడుదల చేయరని, అలానే ఆ తరువాత వచ్చే సంక్రాంతికి కూడా రిలీజ్ చేసే అవకాశాలు తక్కువని, 

సో దానిని బట్టి ఈ సినిమా 2021 సమ్మర్ కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలు ఎక్కువని తేల్చేస్తున్నారు. అయితే దీనిపై కొందరు సినీ విశ్లేషకులు స్పందిస్తూ, ఓవైపు రాజమౌళిగారు బాగానే ప్లానింగ్ తో ఆర్ఆర్ఆర్ షూటింగ్ ని ముందుకు తీసుకెళ్తుంటే, ఆ సినిమాకు బ్రేకులు పడుతున్నందువల్ల, సినిమాను అనుకున్న సమయానికి రిలీజ్ చేయలేరు, కాబట్టి సినిమా చాలావరకు వాయిదా పడుతుంది అని చెప్పడం సరైంది కాదని అంటున్నారు. ఎందుకంటే, ఈ సినిమా ప్రోగ్రెస్ మరియు రిలీజ్ విషయమై ఆర్ఆర్ఆర్ సినిమా యూనిట్ స్పందించే వరకు ఈ వార్తలను నమ్మలేం అంటున్నారు. మరి ఆర్ఆర్ఆర్ విషయమై రాజమౌళి ఎంతవరకు అనుకున్న తేదికి రిలీజ్ చేస్తారో చూడాలి.....!! 


మరింత సమాచారం తెలుసుకోండి: