మెగాస్టార్ చిరంజీవి రీసెంట్‌గా సైరా తో మంచి సక్సస్ ను అందుకున్నారు. ఈ సినిమా తర్వాత చిరు తన 152 కోసం కొరటాల శివ తో త్వరలో సెట్స్ పైకి వెళుతున్నారు. ఈ సినిమాలో మెగాస్టార్ రెండు గెటప్స్ లో కనిపించబోతున్నారని సమాచారం. ఇక ఈ సినిమా ఇటీవలే పూజా కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. ఇంతలోనే మరో ఆసక్తికరమైన వార్త బాగా వైరల్ అయింది. అదేంటంటే కొరటాల సినిమా తర్వాత చిరు సుకుమార్ తో చేయబోతున్నారని. 153 గా తెరకెక్కే ఈ సినిమాను చిరు తనయుడు రాం చరణ్ నిర్మిస్తారని సమాచారం. ఇక ఈ సినిమా కోసమే స్టైలిష్‌స్టార్ అల్లు అర్జున్‌ను పక్కనపెట్టాలని సుకుమార్ భావిస్తున్నట్లు చెప్పుకుంటున్నారు. దీనికి కారణం సూపర్‌స్టార్ మహేశ్ బాబు కోసం అనుకున్న కథను అల్లు అర్జున్‌కు వినిపించడం..అది నచ్చక బన్ని మార్పులు చేర్పులు చేయాలని చెప్పడం.. సుక్కు కి అది ఇబ్బందిగా అనిపించడంతో ఈ నిర్ణయం తీసుకున్నాడని సమాచారం.

ఇక మెగాస్టార్ చిరంజీవి కోసం రామ్‌చరణ్.. మ‌ల‌యాళంలో మోహ‌న్‌లాల్ టైటిల్ పాత్రలో న‌టించిన ‘లూసిఫర్’ రీమేక్ హక్కులు కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ సినిమాను ఎవరు డైరెక్ట్ చేస్తారనేది ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది. ఈ క్రమంలో సుకుమార్, సురేందర్ రెడ్డి పేర్లు గట్టిగానే వినిపిస్తున్నాయి. అయితే ఎక్కువగా సుకుమార్ పేరు పక్కా అని మెగా కాంపౌండ్ నుంచి వార్తలు వస్తున్నాయి. ఒక వేళ ఇదే నిజమైతే మరి సుక్కు.. బన్నీని పక్కనపెట్టేస్తాడా లేకుంటే అసలు ఆ కథనే కంప్లీట్ గా పక్కన పెట్టేస్తాడా అన్నదానిపై ఇప్పుడు టాలీవుడ్‌ ఇండస్ట్రీలో పెద్ద చర్చ జరుగుతోంది.

వాస్తవానికి మొదట సుక్కు.. మహేశ్ కోసం కథ రాసుకోవడం.. ఆ తర్వాత అది వర్కవుట్ కావడంతో బన్నీకి ఒక కథ చెప్పడం.. ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చినప్పటికీ మార్పులు చెప్పడం..అవి పూర్తయినప్పటికీ మళ్లీ రెండోసారి మార్పులు చేయాలని బన్నీనే సలహా ఇవ్వడంతో బాగా డిసప్పాయింట్ అయిన సుక్కు.. ఇక ఇవన్నీ కాదు అసలు ఈ కథే వద్దనుకుని.. అల్లూవారబ్బాయిని పక్కనెట్టేసి.. చిరుతో ‘లూసిఫర్’ రీమేక్ చేయాలని అనుకుంటున్నట్లు తాజా సమాచారం. మరి ఇది ఎంతవరకు నిజమో..? అసలు ఇది జరిగే పనేనా అనేది తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చేంత వరకు చూడాల్సిందే. ఇక సుకుమార్ తీసుకునే నిర్ణయం కూడా చాలా కీలకం. ఎందుకంటే ఇద్దరు మెగా ఫ్యామిలీ హీరోస్. అందులోను ఒక పక్క మెగాస్టార్ మరో పక్క మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ గారి కొడుకు...చిన్న పొరపాటు జరిగినా పరిణామాలు కాస్త తీవ్రంగానే ఉంటాయి.  



మరింత సమాచారం తెలుసుకోండి: