జీవితంలో ఏదైనా సాధించాలి..వంద మందిలో మనకంటూ ఓ పేరు రావాలని ప్రతి యువత కోరుకుంటారు.  ఇందు కోసం ఒక్కొక్కరూ ఒక్కో వేదిక ఎంచు కుంటారు. అందుకోసం అహర్శిశలూ కష్టపడి తమ లక్ష్యాన్ని సాధించుకుంటారు.  ప్రపంచస్థాయిలో తమకంటూ ఓ ప్రత్యేక స్థానం సంపాదించు కుంటారు. ఆ స్థాయికి రావాలంటే ఎన్నో సంవత్సరాలు కష్టపడాల్సి వస్తుంది.  అలాంటిది తన లక్ష్యాన్ని చేరుకొని కోట్ల మంది అభిమానం సంపాదించిన ఓ యువ పాప్ సింగర్ అనుమానాస్పద మృతి చెందడం అందరి మనసు కలచి వేసింది.  


సౌత్ కొరియాకు చెందిన యంగ్ పాప్ సింగర్ సల్లి(25) అనుమానాస్పద రీతిలో మృతి చెందింది.  11 ఏళ్ల బాల్యం నుంచే గాయనిగా సల్లి తన ప్రతిభ చాటుతూ వచ్చింది. సియోల్‌లోని సియోన్‌గ్నమ్‌లోని తన నివాసంలో విగతజీవిగా పడి ఉండటంతో సంగీత ప్రియులను తీవ్ర దిగ్రాంతికి గురిచేసింది.  ఈ విషయాన్ని ఆమె మేనేజర్ మీడియాకు అధికారికంగా వెల్లడించారు. అనుమానాస్పద మృతి వెనుక అసలు కారణాలు ఏవీ తెలియరాలేదు. 


గతంలో సల్లి ఆన్లైన్ లో తీవ్రమైన ట్రోలింగ్ ఎదుర్కొంది. సల్లి కెపాప్ గ్రూప్ ఎఫ్ఎక్స్ లో మెంబర్ గా చాలా కాలం కొనసాగింది.  ట్రోలింగ్ తర్వాత సల్లి తన గ్రూప్ కు దూరమైంది. సల్లీ ని  అసలు చోయ్ జిన్రీ అనే పేరుతో పిలుస్తాను. ఆ సమయంలో చాలా డిప్రెషన్ లోకి వెళ్లినట్లు సల్లి తెలిపింది. ఆమె మృతి వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో ప్రపంచవ్యాప్తంగా ట్రెండ్ అవుతున్నది.  సల్లీ మృత్యువాత పడటం సంగీత ప్రియులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఆమె మృతి వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో ప్రపంచవ్యాప్తంగా ట్రెండ్ అవుతున్నది. 

మరింత సమాచారం తెలుసుకోండి: