బిగ్ బాస్ సీజన్ 3 సోమవారం జరిగిన ఎపిసోడ్ లో ఇంటి సభ్యుల మధ్య గొడవ అందరిని నామినేట్ అయ్యేలా చేసింది. బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్ ప్రకారంగా బౌల్ లో చిట్స్ ఉంటాయి. వాటిలో ఎవరికి ఏ నంబర్ వస్తే ఆ నంబర్ ఉన్న పోడియం దగ్గర నిలుచుకోవాలి. అయితే ఉన్న ఏడుగురిలో 1,2,3 పొజిషన్ లో ఉన్న వారు తప్ప మిగతా నలుగురు నామినేట్ అవుతారు. 


వచ్చిన స్లిప్స్ ప్రకారం బాబా మొదటి స్థానంలో రాహుల్ రెండో స్థానంలో వరుణ్ మూడవ స్థానంలో నిలుచుకున్నారు. 6వ స్థానంలో ఉన్న వితిక వచ్చి బాబాని, రాహుల్ ను కన్విన్స్ చేసేందుకు ప్రయత్నించినా కుదరలేదు. వరుణ్ ను తర్వాత అడుగుతా అని వెళ్లిపోయింది. ఇక 5వ పొజిషన్ లో ఉన్న శివ జ్యోతి కూడా బాబా, రాహుల్ లను అడిగి 3వ స్థానంలో ఉన్న వరుణ్ సందేష్ ను అడిగితే అతను కన్విన్స్ అవ్వలేదు.


అయితే ఆ తర్వాత వితిక వచ్చి వరుణ్ ను కన్విన్స్ చేయగా అతను ఆమెకు 3వ స్థానం ఇచ్చాడు. వితిక శివ జ్యోతి సమానంగా పర్ఫార్మెన్స్ ఇచ్చారు. కాని మెడాలియన్ గెలిచించి కాబట్టి వితికకు తన స్థానం ఇస్తున్నట్టు చెప్పాడు వరుణ్. అయితే తను అడిగితే ఇవ్వలేదు కాని వితిక అడిగితే ఇచ్చావని శివ జ్యోతి గొడవకు దిగింది.


తను నా వైఫ్ కాబట్టే ఇచ్చానని చెప్పాడు వరుణ్. అయితే వితిక కన్నా తనే బెస్ట్ పర్ఫార్మర్ అని శివ జ్యోతి కూడా 3వ స్థానం దగ్గర నిలుచుంది. ఇక బాబా మొదటిస్థానాన్ని శ్రీముఖి, రాహుల్ రెండో స్థానాన్ని అలి కన్విన్స్ చేసి ఆక్యుపై చేశారు. ఇలా జరుగుతుండగా బిగ్ బాస్ బజర్ మోగించాడు. 3వ స్థానంలో ఇద్దరు ఉన్న సందర్భంగా ఈసారి కొత్తగా హౌజ్ మెట్స్ అందరిని నామినేషన్స్ లో ఉంచాడు బిగ్ బాస్. సో ఈ వారం బిగ్ బాస్ నామినేషన్స్ లో ఇంటి సభ్యులంతా ఉన్నారు. ఇది కచ్చితంగా బిగ్ షాక్ అని చెప్పొచ్చు.


మరింత సమాచారం తెలుసుకోండి: