తెలుగులో అగ్ర తారల్లో  ఒకరుగా రాణిస్తున్నారు సమంత. పెళ్లికి ముంద అగ్రహీరోల సరసన గ్లామర్  పాత్రలో మెరిసింది సమంత. ఇక పెళ్లి తర్వాత గ్లామర్ పాత్రలు అన్నింటికి గుడ్ బై చెప్పేసి... నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్రలో నటిస్తోంది. అయితే అక్కినేని నాగచైతన్య తో పెళ్లి అయిన తర్వాత అక్కినేని కోడలు గా మారిన సమంత... క్రేజ్  ఎక్కడికో వెళ్లిపోయింది. ఇక పెళ్లి తర్వాత సమంతకు  అదృష్టం కూడా గట్టిగానే కలిసి వచ్చింది... అందుకే పెళ్లి తర్వాత చేసిన అన్ని సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచాయి. అయితే ఈ ఏడాది రియల్ లైఫ్ జోడి నాగచైతన్య సమంత రీల్ లైఫ్ లో కూడా జత కట్టి మజిలీ సినిమాతో మంచి హిట్ అందుకున్నారు. అయితే తాజాగా సమంత ప్రధాన పాత్రలో నటించిన ఓ బేబీ చిత్రం సమంత సినీ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది.

 

 

 

 

 కాగా  ప్రస్తుతం సమంత దిల్ రాజు ప్రొడక్షన్ లో తమిళ్ సినిమా 96 రీమేక్ లో శర్వానంద్ తో జోడీ కట్టింది. అయితే ఈ సినిమా షూటింగ్ తాజాగా పూర్తయినట్టు సమంత వెల్లడించింది. కాగా 96 తమిళ్ సినిమాలు తమిళ హీరో విజయ్ సేతుపతి త్రిష జంటగా నటించారు. అయితే ఈ సినిమాలో త్రిష పాత్రలో చేసిన సమంత ఆ పాత్ర తనకు మరింత అనుభవం తెచ్చిపెట్టిందని తెలిపింది. కాగా  ప్రస్తుతం సమంత బాటలోనే నయనతార కూడా నడుస్తున్నట్లు కనిపిస్తుంది.  సమంత ఇటీవల నటించిన కొరియన్ మూవీ మిస్ గ్రానీ సినిమాని  ఓ బేబి పేరుతో తెలుగులో రీమేక్ చేసి మంచి విజయాన్ని అందుకుంది సమంత. కాగా ఈ సినిమాకి నందినిరెడ్డి దర్శకత్వం వహించారు. 

 

 

 

 

 అయితే  ఇప్పుడు సమంత బాటలోని లేడీ సూపర్ స్టార్ నయనతార కూడా వెళ్తున్నట్లు కనిపిస్తుంది. నయనతార కూడా ఓ కొరియన్ చిత్రంలో  నటించడానికి అంగీకరించినట్లు సమాచారం. కొరియన్ భాషలో హిట్ అయిన ఓ  సినిమాను తెలుగు తమిళ భాషల్లో తెరకెక్కించనున్నారట. లేడీ ఓరియెంటెడ్ గా సాగే ఈ సినిమాను సురేష్ ప్రొడక్షన్స్ పై హీరో రానా నిర్మించనున్నట్లు తెలుస్తోంది. కాగా ఈ రీమేక్లో లేడీ సూపర్ స్టార్ నయనతార  పోలీస్ పాత్రలో కనిపించనుందట. అయితే ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనుల్లో అన్న ఈ మూవీ గురించి త్వరలోనే అన్ని వివరాలు వెల్లడించబోతున్నట్లు సమాచారం. సమంత బాటలోనే కొరియన్  మూవీ చేస్తున్న లేడీ సూపర్ స్టార్ నయనతార... ఎలాంటి హిట్ కొడుతుందో చూడాలి మరి. అయితే తాజాగా నయనతార చిరంజీవి హీరోగా నటించిన సైరా నరసింహారెడ్డి సినిమాలో నటించి తన నటనకు  ఎన్నో ప్రశంసలు అందుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: