మళయాళ భామ అమలా పాల్ తెలుగులో చేసింది రెండు సినిమాలే అయినా ఆమెకు ఇక్కడ సూపర్ ఫాలోయింగ్ ఏర్పడింది. తమిళంలో స్టార్ క్రేజ్ దక్కించుకున్న ఈ బ్యూటీ పెళ్లి తర్వాత ఆఫర్లు తగ్గినా డైవర్స్ తర్వాత మళ్లీ సినిమాల్లో బిజీ అవుతుంది. కన్నడలో ఓ మోస్తారుగా అవకాశాలు అందుకుంటున్న అమలా పాల్ లేటెస్ట్ గా ఓ క్రేజీ వెబ్ సీరీస్ లో ఛాన్స్ పట్టేసిందని తెలుస్తుంది.


బాలీవుడ్ లో లస్ట్ స్టోరీస్ వెబ్ సీరీస్ సూపర్ హిట్ అయిన విషయం తెలిసిందే. కియరా అద్వాని నటించిన ఆ లస్ట్ స్టోరీస్ వెబ్ సీరీస్ ఇప్పుడు తెలుగులో రీమేక్ అవుతుంది. ఈ వెబ్ సీరీస్ లో అమలా పాల్ నటిస్తుందని తెలుస్తుంది. నందిని రెడ్డి ఈ వెబ్ సీరీస్ ను డైరెక్ట్ చేస్తుందని అంటున్నారు. తెలుగు వెబ్ సీరీస్ ను కూడా నెట్ ఫ్లిక్స్ ప్రొడ్యూస్ చేస్తున్నారు.


లస్ట్ స్టోరీస్ లో కియారా అద్వాని లానే అమలా పాల్ కూడా రెచ్చిపోతుందని ఆశించారు. కాని అసలు ట్విస్ట్ ఏంటంటే అమలా పాల్ చేసేది లస్ట్ స్టోరీస్ లో కేవలం లవ్ స్టోరీ ఎపిసోడ్స్ మాత్రమే అట. హాట్ గా కనిపించడం తనకు ఇష్టమే కాని వెబ్ సీరీస్ లో తనకు వచ్చిన పోర్షన్ మాత్రం లవ్ స్టోరీనే అట.


కాని సోషల్ మీడియాలో మాత్రం అమలా పాల్ లస్ట్ స్టోరీస్ అనగానే ఆమె హాట్ షో ఉంటుందని హడావిడి చేస్తున్నారు. అమలా పాల్ చేసేది కేవలం డీసెంట్ లవ్ స్టోరీ మాత్రమే అట. మరి అమలా హాట్ షో చూడాలని అనుకున్న ఫ్యాన్స్ కు ఇది కాస్త చేదు వార్తే అయినా ఈ వెబ్ సీరీస్ తో తన సత్తా చాటాలని చూస్తుంది అమలా. తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్న అమలా పాల్ ఇప్పటికి సరైన సినిమా పడాలే కాని తానేంటి అన్నది ప్రూవ్ చేసుకుంటానని చెబుతుంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: