సూపర్ స్టార్ మహేష్ బాబు,  ఏఎంబి సినిమాస్ లో మెగాస్టార్ చిరంజీవి, సైరా  రికార్డు సృష్టించింది. కేవలం 13రోజుల్లోనే ఈ చిత్రం ఆ థియేటర్లో 189 షో లద్వారా 1,01,05,900 గ్రాస్ వసూళ్లను రాబట్టి అదుర్స్ అనిపించింది. ఇక ఇటీవల విడుదలైన ఈచిత్రం  పాజిటివ్ టాక్ తో   తెలుగు రాష్ట్రాల్లో 13రోజుల్లో  100కోట్ల షేర్ ను రాబట్టి బ్రేక్ ఈవెన్ కు  చేరువైంది. రెండో సోమవారం  కూడా ఏపీ &తెలంగాణ లో ఈ చిత్రం 90లక్షల షేర్ ను రాబట్టి బాక్సాఫీస్ వద్ద తిరుగులేదని నిరూపించుకుంటుంది.  ముఖ్యంగా దసరా సెలవులను పర్ఫెక్ట్ గా క్యాష్ చేసుకుంది  ఈ చిత్రం.  దీపావళి వరకు ఈ సినిమా కు  వేరే సినిమాలతో పోటీ  లేకపోవడం తో ఫుల్ రన్ లో సైరా  మంచి లాభాలను తీసుకువచ్చేలానే  వుంది.  ఇక బాహుబలి 1, బాహుబలి 2 తరువాత తెలుగు రాష్ట్రాల్లో  100కోట్ల షేర్ ను రాబట్టిన  మూడవ చిత్రం గా సైరా  రికార్డు సృష్టించింది. ఇదిలా ఉంటే ఓవర్సీస్ లో  మాత్రం ఈచిత్రం  బ్రేక్ ఈవెన్ కావడం అసాధ్యం గానే కనిపిస్తుంది. ఇక హిందీలో సైరా  25కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేయగా కేవలం 8కోట్ల షేర్ ను రాబట్టి డిజాస్టర్ అనిపించుకోగా  తమిళ , మళయాలం లోనూ  అదే ఫలితాన్ని రిపీట్ చేసింది.  



పీరియాడికల్  బ్యాక్ డ్రాప్ లో తొలి తరం  స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నర్సింహారెడ్డి  జీవిత చరిత్ర ఆధారంగా  తెరకెక్కిన ఈ చిత్రంలో  నయనతార కథానాయికగా నటించగా   అమితాబ్ బచ్చన్ , విజయ్ సేతుపతి , రవికిషన్ , జగపతి బాబు ,  సుధీప్ , తమన్నా  ముఖ్య పాత్రలు పోషించారు.   బాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ అమిత్ త్రివేది సంగీతం అందించిన ఈ చిత్రాన్ని  సుమారు 270 కోట్ల  భారీ బడ్జెట్ తో కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ పై  హీరో రామ్ చరణ్ నిర్మించాడు. 



మరింత సమాచారం తెలుసుకోండి: