తమిళ ప్రజలందరూ ప్రేమగా అమ్మ గా పిలుచుకునే... తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి పురచ్చి తలైవి జయలలిత జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం తలైవి. తమిళ దర్శకుడు ఏంఎల్ విజయ్  ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు,.. ఈ సినిమాలో  జయలలిత పాత్రలో బాలీవుడ్ క్వీన్ డేర్ అండ్ డాషింగ్ హీరోయిన్ కంగనా రనౌత్ నటిస్తోంది. ఇలాంటి పాత్ర తనకు రావడం చాలా అదృష్టమని కంగనా పలుమార్లు చెప్పిన విషయం తెలిసిందే. అయితే  జయలలిత జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతున్న  సినిమాలో  కంగనారనౌత్ పూర్తిగా జయలలిత లాగా కనిపించడానికి చాలా ప్రయత్నాలు చేస్తుంది. ఈ పాత్ర కోసం ఇప్పటికే తమిళ్  నేర్చుకుంటుంది కంగనా రనౌత్. ఇక సినిమాలో పూర్తిగా జయలలిత ల కనిపించడానికి ప్రొస్థెటిక్  మేకప్ కోసం ఇటీవలే అమెరికా కు వెళ్ళింది కంగనారనౌత్. అయితే కంగనా  తాజాగా మణికర్ణిక అనే హిస్టారికల్ మూవీలో నటించి తన నటనతో అందరి ప్రశంసలు అందుకున్న విషయం తెలిసిందే.

 

 

 

 

 

 ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కూడా మంచి విజయాన్ని అందుకుంది. అయితే మణికర్ణిక లాంటి హిస్టారికల్ మూవీ తర్వాత కంగన నటిస్తున్న మూవీ కావడంతో అందరిలో ఆసక్తి నెలకొంది. అయితే జయలలిత వలే కంగనారనౌత్ కూడా భరతనాట్యంలో శిక్షణ తీసుకుంటు... పూర్తిగా జయలలిత గా మారడానికి బాగానే కష్టపడుతుంది కంగనా. కాగా  జయలలిత పాత్ర ని  ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కంగన... తలైవి  సినిమాలో జయలలిత పాత్రలో అమ్మలా కనిపించడానికి తర్ఫీదు కూడా తీసుకుంటుంది. కాగా తాజాగా ఓ కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చిన కంగనా  మీడియా తో కాసేపు ముచ్చటించారు. ఈ జయలలిత గురించి కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు కంగనా రనౌత్. దేశ రాజకీయాల్లోనే శక్తివంతమైన ఒక రాజకీయ శక్తిగా ఎదిగి... తమిళుల  అమ్మగా  పేరు గడించిన దివంగత ముఖ్యమంత్రి జయలలిత జీవిత చరిత్రలో  ఆమె పాత్రలో నటించే అవకాశం తనకు రావడం అదృష్టంగా భావిస్తున్నానని తెలిపారు కంగనా . 

 

 

 

 

 పురుషాధిక్యత కొనసాగుతున్న కాలంలో చిన్న వయసులోనే సినీ రంగ ప్రవేశం చేసిన జయలలిత ... అన్ని అవరోధాలను అధిగమించి జీవితంలో ఎన్నో విజయాలను అందుకున్నారని చెప్పారు కంగనా . తాను కూడా జయలలిత  గారిలాగే సినీ రంగంలోకి వచ్చిన మొదట్లో చాలా కష్టాలు ఎదుర్కొంటున్నానని  తెలిపారు. అటు సినిమాల్లో ఒక పెద్ద స్టార్ గా ఎదిగడమే కాకుండా రాజకీయాల్లోకి ప్రవేశించి... ప్రజా సేవ చేసి రాజకీయాల్లో తిరుగు లేని మహా నాయకురాలిగా... శక్తివంతమైన మహిళగా జయలలిత జీవించారని  ప్రశంసించారు కంగనా .

మరింత సమాచారం తెలుసుకోండి: