ఇక అసలు విషయానికి వస్తే రొమాంటిక్ సీన్లలో ఇప్పుడు చిరంజీవి నటించడం చాలా ఎబ్బెట్టుగా ఉంటోంది అనేది చిరు అభిమానుల్లో కూడా కొందరు చెబుతున్నమాట నిజం. ఇక  విమర్శకుల సంగతి మాత్రం చెప్పనక్కర్లేదు. గతంలో  'స్టాలిన్' సినిమాలో చిరంజీవి, త్రిష జంట మీదే చాలా కామెంట్లు వచ్చాయి. వాళ్లిద్దరూ సెట్ కాలేదనే అభిప్రాయాలు కూడా వ్యక్తం చేయడం జరిగింది.


ఆ తర్వాత 'శంకర్ దాదా జిందాబాద్' కోసం ఏకంగా పెళ్లి అయిన మోడల్ ను హీరోయిన్ గా తీసుకోవాల్సి వచ్చింది ఈ సినిమాకి. ఇక ఇటీవలి విడుదలైన 'సైరా నరసింహారెడ్డి'లో హీరోయిన్లు చిరంజీవి పక్కన అమరారు. కానీ, తమన్నాపై చిరంజీవి వలపుబాణాలు సంధించడం మాత్రం అంత ఆకట్టుకోలేదు అని అభిమానులు అనుకుంటున్నారు. చిరంజీవి అలాంటి సీన్లు చేయకపోతేనే బావుంటుందనే  అని పలు అభిప్రాయాలు కూడా బాగా వినిపించాయి.


అయితే చిరంజీవి సినిమాలు అంటే మాస్ మసాలాలు కావాల్సిందే అని అంటున్నాడు. అందులో డ్యాన్సులు, పాటలు లేకపోతే అంతే సంగతులు ఇంకా. 'సైరా నరసింహారెడ్డి' అంటే ఆ కాన్సెప్ట్ కు తగ్గట్టుగా నడిచిపోయింది. అయితే తదుపరి సినిమాలకు రొమాన్స్, సాంగ్స్ లేకపోతే ఇబ్బందే అని అంటున్నారు. అయితే చిరంజీవి చేస్తే అంత బాగోదు. అందుకే ప్రత్యామ్నాయ మార్గాన్ని కనుకొంటారో లేదో చూడాలి మరి.


రామ్ చరణ్ తేజను యంగ్ చిరంజీవిగా చూపించే ఏర్పాట్లు చేస్తున్నారు. పాటలు, రొమాన్స్, డ్యాన్సుల కోసం ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్ లో రామ్ చరణ్ ను చూపించి తదుపరి సినిమాలో బండి లాగించేస్తారని సమాచారం ఉంది ఇప్పటి వరుకు. అయితే అన్ని సినిమాలకు ఇది సెట్ అయ్యే ఫార్ములా కాదు కదా. ఒక సినిమా వరకూ ఐతే  ఇది ప్రత్యామ్నాయ మార్గమే అని చెప్పాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: