సినిమాలకు ఎవరు ఎంత రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తారు అని.. అదేనండి రెమ్యునరేషన్..ఇది తెలుసుకోవాలని చాలా అంన్డి ఆసక్తి చూపిస్తూ ఉంటారు. ఒక సినిమా కనుక హిట్ అయితే మరో సినిమా వారితో చేయాలంటే చిత్ర దర్శక నిర్మాతలకు చుక్కలు కనపడుతున్నాయి. మొదటి సినిమా కదా అని ఎదో ఇచ్చిన కాడికి పుచ్చుకుంటారు హీరో హీరోయిన్లు. ఆ సినిమా కనుక హిట్ అయిందంటే వారైతే వేరే సినిమా చేయాలంటే మాత్రం కాస్త జంకు తున్నారు. అంతగా రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తున్నారు మరి. 


సినీ ఇండస్ట్రీలోని హీరోల విషయానికొస్తే ఎటువంటి మార్పు ఉండదు.. స్టార్ హీరోలు వారికి తగిన రేంజ్ అమౌంట్ ఉంటె.. చిన్న హీరోలు సైతం సినిమా సినిమాకు పెంచుతున్నారు. ఇకపోతే హీరోయిన్ల రేట్లు మాత్రం ఎప్పటికప్పుడు మారుతూ ఉన్నాయి. కొత్త హీరోయిన్లు వస్తే పాతవాళ్ళు మరుగున పడతారనడంలో ఎటువంటి సందేహం లేదు. కొత్త దాని మోజులో మన సినీ నిర్మాతలు కూడా ఎక్కడెక్కడినుండో గాలం వేసి పట్టుకొస్తారు. 


సినీ ఇండస్ట్రీలో అధిక రెమ్యునరేషన్ తీసుకుంటున్న వారిలో ముఖ్యంగా వినిపించే పేర్లు సమంత, నయనతార , అనుష్క.. ఈ విషయం పై తాజాగా ప్రియమణి స్పందించింది. ఆడవాళ్ళూ కదా ఎంతోకొంత ఇస్తే  తీసుకుంటారులే అని చాలా మంది అనుకుంటారు.. కానీ, ఈ ముగ్గురు మాత్రం డిమాండ్ చేస్తారు నాకు ఛాయా హ్యాపీగా ఉండు అంటూ ప్రియా వెల్లడించింది. 



ప్రియమణి సినిమాల్లో అంతగా రాణించక పోయిన కూడా వెబ్ సిరీస్ లో మాత్రం హవాను కొనసాగిస్తుంది. ‘ఫ్యామిలీ మ్యాన్’ అనే వెబ్ సిరీస్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు.  ఈ సిరీస్ హిట్ అవ్వడంతో మరో వెబ్ సిరీస్ లో నటిస్తుంది. రానా, సాయి పల్లవి నటిస్తున్న విరాట పర్వం సినిమాలో ప్రముఖ పాత్రల్లో నటిస్తుంది. ఇకపోతే ఈమె ఈటీవీలో సక్సెస్ ఫుల్ గా సాగుతున్న ఢీ షో లో జడ్జీగా వ్యవహరిస్తోంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: