టాలీవుడ్ ఇద్దరు స్టార్ హీరోలైన యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్, మెగా పవర్ స్టార్ రాం చరణ్ ఇద్దరు కలిసి సినిమా చేస్తారన్న ఆలోచన కూడా ఫ్యాన్స్ లో రాలేదు. కాని రాజమౌళి వల్ల అది సాధ్యమైంది. బాహుబలి తర్వాత రాజమౌళి చేస్తున్న ఆర్.ఆర్.ఆర్ సినిమా తారక్, చరణ్ కలిసి చేస్తున్న మల్టీస్టారర్ మూవీగా వస్తుంది.


సినిమాలో అల్లూరిగా రాం చరణ్ నటిస్తుండగా.. కొమరం భీమ్ గా తారక్ కనిపించనున్నాడు. ఇద్దరు ఫ్రీడం ఫైటర్స్ ఒకేచోట కలిస్తే అన్న కథతో ఈ సినిమా వస్తుంది. అయితే ఈ సినిమాలో ఓ ఇంపార్టెంట్ రోల్ లో అజయ్ దేవగన్ నటిస్తున్నారు. దాదాపుగా సినిమాలో ఆయనకు కూడా 30 నిమిషాల పాత్ర ఉంటుందని తెలుస్తుంది.  


ఇదిలాఉంటే సినిమాలో అజయ్ దేవగన్ నటిస్తున్నందుకు 20 కోట్ల పారితోషికం ఇస్తున్నారట. బాలీవుడ్ స్టార్స్ తెలుగు సినిమాల్లో చేయాలంటే ఆమాత్రం డిమాండ్ చేయక తప్పదు. కాని ఈ సినిమా కేవలం తెలుగులోనే కాదు తమిళ, హింది, మళయాళ భాషల్లో కూడా రిలీజ్ అవుతుంది. అందుకే అజయ్ దేవగన్ అడిగినంత ఇచ్చి సినిమాలోకి తీసుకున్నారు. 


ఎన్.టి.ఆర్, రాం చరణ్ ఇద్దరు తమ నట విశ్వరూపాన్ని ఈ సినిమాతో చూపిస్తారని తెలుస్తుంది. కలిసి చేస్తున్న ఎవరికి వారు ది బెస్ట్ ఇచ్చేందుకు చూస్తున్నారు. ఇక సినిమాలో అలియా భట్ ఒక హీరోయిన్ గా నటిస్తుంది. మరో హీరోయిన్ గురించి ఎలాంటి డీటైల్స్ బయటకు రాలేదు. ఏది ఏమైనా ఆర్.ఆర్.ఆర్ మరో బాహుబలి కాదు అంతకుమించి సినిమా అయ్యేలా ప్లాన్ చేస్తున్నారు. 2020 జూలై 30న రిలీజ్ ప్లాన్ చేస్తున్న ఆర్.ఆర్.ఆర్ సినిమా అనుకున్న టైం కు రావడం కష్టమే అని అంటున్నారు. కొద్దిరోజులుగా 2021 సంక్రాంతికి ఈ మూవీ రిలీజ్ ఫిక్స్ చేసినట్టుగా వార్తలు వస్తున్నాయి. అయితే ఆ వార్త్రల్లో ఎంతవాకు నిజం ఉంది అన్నది చిత్రయూనిట్ అఫిషియల్ గా ఎనౌన్స్ చేస్తే తెలుస్తుంది.



మరింత సమాచారం తెలుసుకోండి: