మా అబ్బాయి ఇన్ఫోసిస్ లో జాబ్,మా కోడలు ఇన్ఫోసిస్ లో జాబ్ అంటూ గర్వంగా చెప్పుకునే రేంజ్ లో సెలరీలు ఇచ్చే సాఫ్ట్ వేర్ కంపెనీ గా ఎదగడమే కాకుండా దేశ ఖ్యాతిని నలుదిశలా వ్యాప్తింప చేసిన నారాయణ మూర్తిగారు తెలియని వారంటు లేరు ఇప్పుడు కథ ఇక్కడే మొదలైంది.భారత ఐటీ పితామహుడిగా చెప్పుకునే ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు ఎన్ఆర్ నారాయణ మూర్తి బయోపిక్ వస్తుందంటూ ఎప్పటి నుంచో వార్తలు వస్తున్నాయి. మొత్తానికి ఇది కార్యరూపం దాల్చుతోంది. ఇండియన్ ఐటీ ఫస్ట్ కపుల్‌గా చెప్పుకునే నారాయణ మూర్తి, సుధా మూర్తి దంపతుల జీవితాల ఆధారంగా సినిమా రాబోతోంది. ‘బరేలీ కి బర్ఫీ’ ఫేమ్ అశ్వినీ అయ్యర్ తివారి ఈ సినిమాకు దర్శకత్వం వహించనున్నారు. ‘మూర్తి’ టైటిల్‌తో ఈ సినిమా తెరకెక్కనుంది.

ఈ మేరకు అశ్వినీ అయ్యర్ తివారి స్వయంగా ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ఈ విషయాన్ని వెల్లడించారు. ప్రస్తుతం అశ్విని ‘పంగా’ సినిమాతో బిజీగా ఉన్నారు. కంగనా రనౌత్ ప్రధాన పాత్రలో నటిస్తోన్న ఈ చిత్రం విడుదలకు సిద్ధమవుతోంది. ఇందులో కంగనా కబడ్డీ ప్లేయర్‌గా కనిపించనున్నారు. ఈ సినిమా పూర్తయిన తరవాత ‘మూర్తి’ని అశ్విని మొదలుపెట్టనున్నారు. వచ్చే ఏడాది రిపబ్లిక్ డే సందర్భంగా సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని చూస్తున్నారు. తన భర్త నితీష్ తివారి, మహవీర్ జైన్‌లతో కలిసి అశ్విని ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు.

కాగా, ‘మూర్తి’ సినిమా ప్రకటనను ఇన్‌స్టాగ్రామ్ ద్వారా చేసిన అశ్విని.. దానిలో ఒక భావోద్వేగ సందేశాన్ని కూడా రాశారు. సుధా మూర్తి జీవితం ఎంతో మందికి స్ఫూర్తి అని అన్నారు. ఆమె స్ఫూర్తితోనే తాను బాలీవుడ్‌కు వచ్చానని, దర్శకురాలిగా ఎదిగానని చెప్పారు. నారాయణ మూర్తి, సుధా మూర్తిల కథను చెప్పే అవకాశం రావడం తన అదృష్టమని పేర్కొన్నారు. తనను నమ్మి ఇంత గొప్ప కథను తన చేతిలో పెట్టారని, ఆ అంచనాలను అందుకునేలా దీవించమని ఆ దేవుడిని ప్రార్థిస్తున్నానని అశ్విని వెల్లడించారు.

కాగా, దేశంలోని ప్రముఖ దంపతుల్లో నారాయణ మూర్తి, సుధా మూర్తి జంట ఒకటి. వీరిద్దరినీ భారత ప్రభుత్వం పద్మశ్రీ అవార్డులతో సత్కరించింది. నారాయణ మూర్తి అయితే పద్మ విభూషణ్ అవార్డు కూడా పొందారు.ఇక పై ఎలాంటి బయోపిక్ ఎలాంటి హిట్ కొట్టనుందో అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. చూద్దాం మంచి హిట్ కొట్టి ఇటు ఐటీ నుండి సినిమాల దాక విజేతగా మారున్నార చూద్దాం.

 

మరింత సమాచారం తెలుసుకోండి: