ఇర్ఫాన్ పఠాన్ మళ్ళీ మరో ఇన్నింగ్స్ మొదలుపెడుతున్నాడు. క్రికెటర్‌గా మనకి సుపరిచితుడైన ఇర్ఫాన్ ఇప్పుడు నటన పరంగానూ..,, అది కూడా విలన్ గా తనని నిరూపించుకునే ప్రయత్నం చేస్తున్నాడు, అది కూడా స్టార్ హీరో విక్రమ్‌తో. విక్రమ్ రాబోయే 58వ చిత్రం ఇంకా టైటిల్, నటీనటుల వివరాలు వెల్లడి కాలేదు. కానీ ఇందులో ఇర్ఫాన్ విలన్ పాత్రలో నటించనున్నారు. ఈ విషయాన్ని ఇర్ఫానే స్పష్టం చేశారు. తన కొత్త ప్రయాణం కోసం ఎంతో ఆత్రతుగా ఎదురుచూస్తున్నానని ఇర్ఫాన్ మీడియా ద్వారా తెలిపారు.

క్రికెట్ తో రిటైర్మెంట్ తర్వాత ‘ఝలక్ దిఖ్‌లాజా’ అనే డ్యాన్స్ రియాల్టీ షోలో ఇర్ఫాన్ పాల్గొన్నారు. ఇప్పుడు నటుడిగానూ కనిపించనున్నారు. ఈ సినిమా ద్వారా ఇర్ఫాన్ తానేంటో నిరూపించుకోగలిగితే ఆయన్ను తెలుగు సినిమాల్లోనూ చూసే అవకాశం అభిమానలకు దక్కుతుంది. ఇక ఇర్ఫాన్ క్రికెట్ కెరీర్ గురించి చెప్పాలంటే.. సక్సెస్‌ఫుల్ ఆల్ రౌండర్‌గా భారతీయ క్రికెట్ చరిత్రలో తన పేరును లిఖించుకున్నారు. తన కెరీర్‌లో మొత్తం ఆడిన 173 మ్యాచ్‌లు., 301 వికెట్లు., 2821 పరుగులు., ఓ సెంచరీ కూడా ఉంది. 2007 ఐసీసీ వరల్డ్ టీ20 మ్యాచ్‌లో ఇర్ఫాన్ది కీలక పాత్ర అని చెప్పాలి. ఫాస్ట్ మీడియం స్వింగ్ బౌలర్‌గా తన కెరీర్‌ను మొదలు పెట్టిన ఇర్ఫాన్.. 19 ఏళ్లకే నేషనల్ టీంలో చోటు సంపాదించుకున్నాడు.

బీసీసీఐ నుంచి కొన్నేళ్ల పాటు బహిష్కరించింన మరో క్రికెటర్ శ్రీశాంత్ కూడా సినిమాల్లో రాణిస్తున్నారు. తమిళంలో హన్సిక ప్రధాన పాత్రలో నటిస్తున్న సినిమాలో శ్రీశాంత్ విలన్. వీరే కాదు క్రికెటర్ హర్భజన్ సింగ్ కూడా ఓ తమిళ సినిమాలో నటిస్తున్నాడట. క్రికెట్ గాడ్ అయిన సచిన్ తెందుల్కర్ కూడా రిటైర్ అయ్యాక ఆయన జీవితాధారంగా ‘సచిన్ ఎ బిలియన్ డ్రీమ్స్’ అనే బయోపిక్‌ను తెరకెక్కిస్తున్నారని తెలిసి తన పాత్రలో తానే నటించి ఫ్యాన్స్‌ను సర్‌ప్రైజ్ చేశారు. ఇలా క్రికెటర్లు రిటైర్ అయ్యాక సినిమాలనే తమ కెరీర్‌గా చేసుకోబోతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: