ఇక  కోలీవుడ్ ఇండస్ట్రీలో నెపోటిజం (బంధుప్రీతి)  కూడా ఉందా? ప్రముఖ వివాదాస్పద ప్రముఖ తమిళ నటి మీరా మిథున్ చేసే ఆరోపణలు చూస్తుంటే అదే నిజం అని తెలుస్తుంది. విలక్షణ నటుడు కమల్ హాసన్‌పై ఆరోపణలు చేస్తున్నారు మీరా. మీరా కథానాయికగా ‘అగ్ని సిరాగుగల్’ అనే సినిమాలో నటించాల్సి ఉండేది. అయితే సినిమాలో ఆమెను తీసుకున్నట్లే తీసుకుని ఆ తర్వాత తొలగించడం జరిగింది. ఆమె ప్లేస్‌లో కమల్ హాసన్ చిన్న కుమార్తె అక్షరా హాసన్‌ను ఎంపిక చేయడం జరిగింది.


ఈ మేరకు కమల్ హాసన్ అనుకున్నది సాధించారంటూ మీరా సోషల్ మీడియాను వేదికగా తన ఆవేదనను వ్యక్తం చేయడం జరిగింది. ఈ విషయం చుస్తే ‘కోలీవుడ్‌లో నెపోటిజం పీక్స్‌లో ఉందని నిజమైంది. సినిమా నుంచి నన్ను తప్పించి తన కూతురికి అవకాశం వచ్చేలా చేయడం కమల్ హాసన్. ఇలా చేసినందుకు దర్శకుడు నవీన్‌కు, అక్షరా హాసన్‌కు, నిర్మాత శివకు సిగ్గుగా లేదా అని? వారికి డబుల్ స్టాండర్డ్స్ బుద్ధి ఉందని బాగా కనిపిస్తుంది’ అని  అన్నారు. 


ఇటీవల మీరా చేస్తున్న ఆరోపణలపై దర్శకుడు నవీన్ స్పందన తెలిపారు. ‘అగ్ని సిరాగుగల్ సినిమాలో మొదట షాలినీ పాండేను ఎంపిక చేసుకున్నాం. ఆ తర్వాత కొన్ని కారణాల వల్ల ఆమె స్థానంలో అక్షర హాసన్‌ను ఎంపిక చేసుకున్నాం అని తెలిపారు. ఇప్పుడు ఈ సినిమాలో అక్షర హాసనే కథానాయిక. అసలు సినిమాలో మీరా మిథున్‌ను ఎంపిక చేసుకోలేదు. నా అనుమతి లేకుండా సినిమాలో తనను ఎంపిక చేసుకున్నామని ఆమె  మీడియా ముందుకు వచ్చి తెలియచేసింది. నీకు సమస్య ఉంది మీరా. ముందు వైద్యుడిని కలువు’ అని అన్నారు.


ఈ వివాదం ఇక్కడితో ఆగలేదు. నవీన్ చేసిన కామెంట్‌పై మీరా మండిపడ్డారు. ‘నన్ను డాక్టర్ దగ్గరికి వెళ్లు అని చెప్పడానికి నీకెంత ధైర్యం? మర్యాదగా మాట్లాడు. నువ్వు నన్ను నీ సినిమాలో తీసుకున్నావనడానికి నా వద్ద ఆడియో, వీడియో ఫైల్స్ అన్ని కూడా  ఉన్నాయి. వాటిని బయటపెడితే నీకే కాదు నీ ఫ్యామిలీకి కూడా నష్టమే. బయటపెట్టమంటావా?’ అని బెదిరించడం జరిగింది


మరింత సమాచారం తెలుసుకోండి: