మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ హీరోగా మారుతీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా సినిమా ప్రతిరోజూ పండగే. గతంలో వరుస అపజయాలతో సతమతం అయిన సాయి ధరమ్ తేజ్, ఇటీవల కిషోర్ తిరుమల దర్శకత్వంలో వచ్చిన చిత్రలహరి సినిమాతో మంచి విజయాన్ని అందుకుని మళ్ళి ఫామ్ లోకి వచ్చాడు. ఇక ప్రస్తుతం మారుతీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ ప్రతిరోజు పండగే సినిమాతో కూడా మరొక విజయాన్ని అందుకోవాలని, ఎంతో కసితో ఈ సినిమాలో నటిస్తున్నాడు సాయి ధరమ్ తేజ్.

రాశి ఖన్నా హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో సాయి ధరమ్ తేజ్ కు తండ్రిగా సత్య రాజ్ నటిస్తున్నారు. యువి క్రియేషన్స్, గీత ఆర్ట్స్ బ్యానర్లపై ఈ సినిమాని బన్నీ వాసు అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. తండ్రి కొడుకుల మధ్య అనుబంధాన్ని తెల్పుతూ, ఫ్యామిలీ ఎమోషన్స్ కి ఎంటర్టైన్మెంట్ ని జోడించి దర్శకుడు మారుతీ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. యువ సంగీత దర్శకుడు థమన్ సంగీతాన్ని అందిస్తున్న ఈ సినిమా ఫస్ట్ గ్లిమ్ప్స్ ప్రోమో వీడియోని కాసేపటి క్రితం యూట్యూబ్ లో రిలీజ్ చేసింది సినిమా యూనిట్.

సాయి ధరమ్ తేజ్ బర్త్ డే కానుకగా నేడు ఈ టీజర్ ని రిలీజ్ చేసారు సినిమా యూనిట్ సభ్యులు. కాసేపటి క్రితం వీక్షకుల ముందుకు వచ్చిన ఈ టీజర్ ప్రోమో, ప్రస్తుతం యూట్యూబ్ లో ఆడియన్స్ ఆదరణతో పాటు మంచి వ్యూస్ తో దూసుకుపోతోంది. ఆకట్టుకునే బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ తో సినిమాలోని కొన్ని కీలక సన్నివేశాలను కలగలిపి ఎంతో అందంగా దర్శకుడు తెరకెక్కించిన ఈ సినిమా ఫస్ట్ గ్లిమ్ప్స్ వీడియో ప్రోమో పై మీరు కూడా ఒక లుక్ వేయండి మరి.....!!


మరింత సమాచారం తెలుసుకోండి: