ఆమె ఒక సీనియర్ హీరోయిన్.. సౌత్ లో ఎంతమంది స్టార్ హీరోలు ఉన్నారో దాదాపు వారందరితో నటించింది. అయితే ఈమధ్య సినిమా ఆఫర్లు తగ్గాయి. అలా అని పూర్తిగా ఆఫర్లు లేకుండా పోలేదు. ఒకటి అరా ఆఫర్లతో పాటుగా క్యామియోలు చేస్తూ నెట్టుకొస్తోంది. ఇక ఈ భామ స్పెషాలిటీ ఏంటంటే సూపర్ డ్యాన్సర్.  అందుకే ఎక్కడ ఏ ఈవెంట్ జరిగినా ఈ భామ డ్యాన్స్ ప్రోగ్రాం కంపల్సరీగా ఉంటుంది.
 
రీసెంట్ గా ఈ భామ అలానే ఒక కార్యక్రమానికి హాజరైందట.  అయితే ఈసారి మార్పేంటంటే స్మోకింగ్ హ్యాబిట్.  గతంలో ఈ ధూమపానం అలవాటు ఉందో లేదో తెలియదు కానీ పబ్లిక్ గా ఎక్కడా స్మోకింగ్ చేస్తూ దొరకలేదు. ఈసారి మాత్రం తన కారవాన్ దగ్గ దమ్మేస్తూ ఉంటే ఒక ఔత్సాహికుడు ఫోటోలు తీశాడట. ఈ విషయం తెలిసిన ఆ భామ తన సెక్యూరిటీవారికి  చెప్పి.. వారితో ఆ ఫోటోలను 'మర్యాదపూర్వకంగా' డిలీట్ చేయించిందట.
ఈ విషయం తెలిసిన సదరు ఈవెంట్ నిర్వాహకులు ఆ సీనియర్ హీరోయిన్ కు ఇలాంటి న్యూసెన్స్ కు దూరంగా ఉండాలని.. లేకపోతే పరువుపోతుందని ధూమపాన జాగ్రత్తలు చెప్పారట. పబ్లిక్ గా పొగ త్రాగరాదు.. రహస్యంగా ఎన్ని సిగరెట్లు కాల్చినా ఈ లోకం పట్టించుకోదని.. ఈ హిపోక్రాటిక్ లోకానికి అదే కరెక్టని.. చాలామంది సెలబ్రిటీలు అదే పంథా అనుసరిస్తారని జ్ఞానబోధ చేశారట. ఎంతో లోకాన్ని చూసిన సదరు హీరోయిన్ ఫేడ్ అవుట్ అయిన దశలో ఇలాంటి కొత్త సమస్యలను ఎందుకు తెచ్చిపెట్టుకుంటోందో! హీరో,హీరోయిన్ లు పబ్లిక్ కి యూత్ కి సందేశం ఇవ్వాలి కానీ ఇలాంటి వాటిని ప్రోత్సహించకూడదు . ఒక వేళా వాళ్లకు  వర్క్ ప్రెషర్  ఉన్న ఇలా అందరికి దొరకకుండా చూసుకోవాలి .



మరింత సమాచారం తెలుసుకోండి: