బిగ్ బాస్ సీజన్ 3 మరో 3 వారాలు మాత్రమే ఉన్న ఈ షోలో చివరి రోజుల్లో ఆట మంచి రసవత్తరంగా సాగుతుంది. ప్రస్తుతం 7 మంది ఇంటి సభ్యులు ఉన్న బిగ్ బాస్ హౌజ్ లో ఈ వారం నామినేషన్స్ ప్రక్రియ బిగ్ బాస్ ఇచ్చిన ఆంక్షలకు విరుద్ధంగా ఆడారని ఇంటి సభ్యులను అందరిని నామినేట్ చేశాడు బిగ్ బాస్.


అయితే ఉన్న ఏడుగురులో స్ట్రాంగ్ ఎవరు వీక్ ఎవరు అన్నది ఎనాలసిస్ చేస్తే టాప్ 5 లో వరుణ్, శ్రీముఖి, రాహుల్ వచ్చేలా కనిపిస్తున్నారు. తర్వాత రెండు పొజిషన్ లో శివ జ్యోతి, వితిక ఉండే అవకాశం ఉంది. ఇక మిగిలిన బాబా, అలి రెజాలు చివరి రెండు స్థానాల్లో ఉంటారని అంటున్నారు.


అయితే ఈవారం నామినేషన్స్ లో అందరు ఇంటి సభ్యులు ఉన్నారు. అంటే అందరి మీద ఎలిమినేషన్ కత్తి ఉన్నట్టే. ముఖ్యంగా బాబా భాస్కర్, వితిక, శివ జ్యోతి, అలి రెజాల మీద ఈ వారం నామినేషన్స్ ఎక్కువ ఎఫెక్ట్ చూపించొచ్చని అంటున్నారు. వితికకు మొదటి నుండి వరుణ్ సపోర్ట్ గా ఉన్నాడు కాబట్టే ఇప్పటివరకు ఆట ఆడిందని కామెంట్స్ వస్తున్నాయి. ఇక బాబా కూడా తనకు భాష రాకున్నా ఆయన చాలా కష్టపడ్డారు అయినా సరే ఆటలో ఆయన హండ్రెడ్ పర్సెంట్ ఇవ్వలేదని అతన్ని టార్గెట్ చేస్తున్నారు.     


ఇక శివ జ్యోతి ఒక్కొక్కసారి స్ట్రాంగ్ కంటెస్టంట్ గా అనిపిస్తుంది.. మరోసారి వీక్ కంటెస్టంట్ గా అనిపిస్తుంది. అందుకే శివ జ్యోతి కూడా ఈ వారం ఎలిమినేట్ అయ్యే అవకాశం ఉందని అంటున్నారు. ఆల్రెడీ రెండు వారాలు బయటకు వెళ్లి వచ్చాడు కాబట్టి అలి రెజా ఎలిమినేట్ అవ్వొచ్చని టాక్. ఇలా ఎవరి కాలిక్యులేషన్స్ వారికి ఉన్నాయి. మరి ఈ వారం బిగ్ బాస్ హౌజ్ నుండి ఎలిమినేట్ అయ్యేది ఎవరో తెలియాలంటే మాత్రం సండే వరకు వెయిట్ చేయాల్సిందే. 



మరింత సమాచారం తెలుసుకోండి: