మనందరికి టీవీ ద్వారానే పాపులారిటీ అయిన నటి అవికా గోర్‌. తనని టాలీవుడా? బాలీవుడా? టీవీ ఇండస్ట్రీయా? అని అడిగితే ఎప్పుడూ టీవీకే నా ఓటు అన్నారు అవికా గోర్‌. ఈ చిన్నారి పెళ్లి కూతురు (అవికా గోర్‌) సీరియల్‌ ద్వారా గుర్తింపు పొంది హీరోయిన్‌గా మారింది ఈ భామ. ఓంకార్‌ దర్శకత్వంలో అశ్విన్‌ హీరోగా నటించిన రాజుగారి గది - 3 లో హీరోయిన్‌గా నటించారు అవికా గోర్‌. అయితే ఈ నెల 18న ఈ సినిమా రిలీజ్‌ కాబోతుంది.


ఈ సందర్భంగా అవికా మాట్లాడుతూ ఎక్కడికి పోతావు చిన్నవాడా సినిమా తర్వాత వరుసగా టీవీ షోలు, ఒక హిందీ సినిమాను చేశాను. అందుకే తెలుగులో సినిమాలు చేయలేకపోయాను, పేరుకి చేశాం అనేట్టు సినిమా అంగీకరించడం నాకు అసలు ఇష్టం ఉండదు. ప్రస్తుతం ‘ఖత్రా’ అనే టీ షోలో చేస్తున్నాను. ఆ సమయంలో యాంకర్, దర్శకుడు ఓంకార్‌ కలసి రాజుగారి గది 3 కథ వినిపించారు. ఈ సినిమాలో ముందు తమన్నాను అనుకున్నాం, డేట్స్‌ కుదరకపోవడం వల్ల ఆమె తప్పుకున్నారు అని ముందే చెప్పారు. ఆయన కథ చెప్పటం పూర్తయ్యే సమయానికి భయపడిపోయాను. అయితే నేను హారర్‌ సినిమాలు ఒక్కదాన్నే చూడటానికి భయపడుతుంటాను. ఫ్యామిలీ, ఫ్రెండ్స్‌ ఇలా ఎవరోఒకరు ఉంటేనే చూస్తాను. ఈ సినిమా షూటింగ్‌ స్టార్ట్‌ అయ్యాక పూర్తి మేకప్‌ వేసుకున్నాక నన్ను నేను అద్దంలో చూసుకుని, నేను చాలా భయపడ్డాను. 


మా నాన్నగారైతే ‘ఇదే నువ్వు’ అని ఆటపట్టించారు అని అన్నాడు. ప్రేక్షకులు భయపడుతూనే విపరీతంగా నవ్వుతారు ఇదే మా సినిమా హైలెట్‌. ప్రస్తుతం తెలుగు నాకు అర్థం అవుతోంది, నేర్చుకుంటున్నాను. సెట్లో పెద్ద పెద్ద టెక్నీషియన్స్‌ తో వర్క్‌ చేయడం మంచి ఎక్స్‌పీరియన్స్‌. కమిడియన్ అలీ లాంటి లెజెండ్‌తో నటించడం మర్చిపోలేను. కుదిరితే బిగ్‌ బాస్‌ షో హోస్ట్‌ చేయాలనుంది కానీ బిగ్‌బాస్‌ హౌస్‌లోకి వెళ్లలేను నేను. ఒక తెలుగు ప్రాజెక్ట్‌ కమిట్‌ అయ్యాను అది త్వరలోనే ప్రకటిస్తాను అన్నారు.


అన్ని ఇండస్ట్రీల్లో తెలుగు ఇండస్ట్రీ బెస్ట్‌ అని నా అభిప్రాయం అన్నది ఈ చిన్నారి పెళ్లి కూతురు. ఇక్కడ ఉన్నంత ప్లానింగ్, పద్ధతి ఎక్కడా కూడా ఉండదు. జూలైలో సినిమా ప్రారంభించి అక్టోబర్‌లో మీముందుకు వచ్చేస్తున్నాం. యాక్టర్‌గా నాకు చాలా ఎక్స్‌పీరియన్స్‌ ఇచ్చింది తెలుగు ఇండస్ట్రీయేనే.


మరింత సమాచారం తెలుసుకోండి: