మెగాస్టార్ చిరంజీవి చేసే డాన్సులు, ఫైట్లు గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. వీటితోపాటు చిరంజీవికి మరో ఆభరణం కూడా ఉంది. అదే.. కామెడీ. చిరంజీవి కామెడీ టైమింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిందే. ఎన్నో సినిమాల్లో ఆయన కామెడీ టైమింగ్ తో హిట్లు అందుకున్నారు. వాటిల్లో ప్రముఖమైనది శంకర్ దాదా ఎంబీబీఎస్. 2004 అక్టోబర్ 15న విడుదలైన ఈ సినిమాకి నేటితో 15 ఏళ్ళు పూర్తయ్యాయి.

 

 

 

శంకర్ దాదా ఎంబీబీఎస్ సినిమా హిందీ సినిమా మున్నాభాయ్ ఎంబీబీఎస్ కు రీమేక్. రాజ్ కుమార్ హిరానీ దర్శకత్వంలో సంజయ్ దత్ హీరోగా నటించిన ఈ సినిమా ఒరిజినల్ వెర్షన్ లో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. తెలుగులో జెమినీ కిరణ్ ఈ సినిమాని చిరంజీవితో జయంత్ సి పరాన్జీ దర్శకత్వంలో తెరకెక్కించారు. హిందీకి కంటే ఎక్కువగా ఈ సినిమాలో చిరంజీవి కామెడీ పండించారు. హిందీ హిట్ కు ఏమాత్రం తీసిపోని విధంగా తెలుగులోనూ బ్లాక్ బస్టర్ హిట్ అయింది. సినిమాలో చిరంజీవి కాలేజ్ ఎపిసోడ్స్ బాగా పండాయి. కాలేజ్ కి వెళ్ళేటప్పుడు వాకింగ్ స్టయిల్ సినిమాకే హైలైట్. ఎడిటింగ్ లో మొదట ఈ సీన్ తీసేసాడు  డైరెక్టర్ జయంత్. చిరంజీవి చూసి.. అది మాస్ బిట్.. ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తారు అని మళ్ళీ యాడ్ చేయించారు. ఆ సీన్ థియేటర్ లో పేలిపోయింది. చిరంజీవి మాట్లాడే ఇంగ్లీష్ నవ్వులు పూయిస్తాయి.

 

 

 

శ్రీకాంత్ ఈ సినిమాలో చిరంజీవి అనుచరుడిగా ఏటీఎం అనే క్యారెక్టర్ చేసాడు. సినిమాకు ఈ పాత్ర ఓ పిల్లర్. చిరంజీవి ఆటపట్టించే డీన్ పాత్రలో పరేశ్ రావల్ మెప్పించాడు. సినిమాలో పాటలన్నీ సూపర్ హిట్టే. చిరంజీవి ఈ సినిమాలో కామెడిలో తన పవర్ ఏంటో చూపారనే చెప్పాలి. సోనాలి బెంద్రే హీరోయిన్ గా నటించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: