క్యాస్టింగ్ కౌచ్ అంటూ ఒక కొత్త సినిమా రంగాన్ని ఏకిపారేసిన శ్రీ రెడ్డి తాజాగా ఇటీవల కోలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్న చాలా మంది ని టార్గెట్ చేస్తూ సోషల్ మీడియాలో వీడియోలు పోస్ట్ చేస్తూ మరియు అదే విధంగా కామెంట్ చేస్తూ తమిళ మీడియా వర్గాలలో ఒక పెద్ద హాట్ టాపిక్ అయింది. అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడిప్పుడే యువ నాయకుడిగా రాయలసీమ ప్రాంతానికి చెందిన వ్యక్తిగా పైకి వస్తున్న వైసిపి పార్టీ నాయకులు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి కి ఒకరోజు జీవితంలో పెళ్ళాం గా ఉన్న చాలు నా జన్మ ధన్యం అయిపోద్ది అంటూ శ్రీరెడ్డి కామెంట్లు చేయడం జరిగింది. దీంతో ఈ వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ గా మారుతున్న క్రమంలో తాజాగా శ్రీ రెడ్డి వ్యభిచారం చేయడం లో తప్పులు అంటూ ఇటీవల విశాఖపట్నంలో కంచరపాలం లో సెక్స్ రాకెట్ ముఠా ని పట్టుకున్న పోలీసులపై షాకింగ్ కామెంట్ చేసింది.


ఈ రైడ్ లో ముగ్గురు మహిళలు ఇద్దరు యువతులను మరియు అదే విధంగా ఒక విటుడిని అరెస్ట్ చేశారు. అయితే ఈ విషయంలో శ్రీరెడ్డి మధ్యలో కలుగజేసుకొని, వ్యభిచారం అనేది ఒక సమాజ సేవ లాంటిది అని, అక్కడితో ఆగకుండా వేశ్యల్ని దేవతలతో పోలుస్తూ పేస్ బుక్ ద్వారా ఒక దారుణమైన పోస్టు పెట్టింది శ్రీరెడ్డి. “వేశ్యలు అనేవాళ్లు లేకపోతే.. మీ చిన్నారి కూతుళ్లకు భద్రత లేదు. వాళ్లని ఆ పని చేయనీయండి.


కనీసం మగాళ్లు జంతువులుగా మారకుండా ఉంటారు. వేశ్యలంటే దేవతలు. ఎందుకంటే వాళ్లు ఈ రకంగా సామాజిక సేవ చేస్తున్నారు. ఒకవేళ ఈ వేశ్యలే లేకపోతే మీ ఫ్యామిలీ లేడీస్‌ని ఈ మగాళ్లు రేప్ చేస్తారు” అంటూ తన పోస్టు ద్వారా హెచ్చరించింది శ్రీరెడ్డి. అంతే కాకుండా వ్యభిచారం చేస్తున్న మహిళలు మరియు మగవాళ్ళు ఆనందంగానే ఉన్నారు కదా మీరు ఎందుకు వారిని బాధ పెడుతున్నారు అంటు పోలీసుల పై ప్రశ్నల వర్షం కురిపించింది శ్రీ రెడ్డి.


మరింత సమాచారం తెలుసుకోండి: