ఈ మ‌ధ్య కాలంలో ఏ భ‌ష చిత్ర‌మైనా స‌రే ప్ర‌పంచ వ్యాప్తంగా విడుద‌ల‌వ‌డం స‌ర్వ‌సాధార‌ణ‌మైపోయింది. ఈ నేప‌ధ్యంలోనే హాలీవుడ్ సూపర్‌స్టార్ ఆర్నాల్డ్ స్క్వార్జెనెగర్ నటించిన లేటెస్ట్ చిత్రం టర్మినేటర్ (డార్క్ ఫేట్).  నవంబర్ 1న విడుదల కానున్న ఈ చిత్రాన్ని హాలీవుడ్ ప్రముఖుడు జేమ్స్ కామెరాన్ రూపొందించారు.  అన్ని భాష‌ల్లో విడుద‌ల కానున్న‌ ఈ సినిమా తెలుగు వెర్షన్‌కు సంబంధించిన ట్రైలర్ ఆవిష్కరణ కార్యక్రమం హైదరాబాద్‌లో జరిగింది. ఈ కార్యక్రమానికి విజయ్ దేవరకొండ ముఖ్య అతిథిగా విచ్చేసి ట్రైలర్‌ను ఆవిష్కరించారు. అలాగే కార్యక్రమంలో డిస్ని సంస్థ ప్రతినిధి విక్రమ్ దుగ్గల్ పాల్గొన్నారు..
ఈ సందర్భంగా విజయ్ దేవరకొండ మాట్లాడుతూ...


 "టర్మినేటర్ డార్క్ ఫేట్ ట్రైలర్ నేను విడుదల చెయ్యడం సంతోషంగా ఉంది. టెర్మినేటర్ సిరీస్‌లో ఇది ఐదోవది. నేను హాలీవుడ్ సినిమాలను ఇంగ్లీష్ వెర్షన్ లో చూసేవాడిని. ఫ్రెండ్ కోసం '300'ను తెలుగు డబ్బింగ్ లో చూశా. అప్పట్లో డబ్బింగ్ వింతగా ఉండేది. ఇప్పుడు డిస్నీ వాళ్లు క్వాలిటీగా డబ్బింగ్ చేస్తున్నారు. 'టెర్మినేటర్ జడ్జిమెంటల్ డే' సినిమా తర్వాత నాకు బాగా నచ్చిన ట్రైలర్ ఇది. సినిమా కోసం మీలాగే నేను వెయిట్ చేస్తున్నాను. ఆ థ్రిల్ మాటల్లో చెప్పలేం. మళ్లీ నాకు బాల్యం గుర్తొచ్చింది. టెర్మినేటర్ సిరీస్‌ చిత్రాలన్నీ విజయం సాధించాయి. అలానే టెర్మినేటర్: డార్క్ ఫేట్ సినిమా కూడా కలెక్షన్లపరంగా ఘన విజయం సాధించాలని కోరుకుంటున్న. హాలీవుడ్ సినిమాలు మాచేత ప్రమోషన్ చేపిస్తున్నారు. అలాగే టాలీవుడ్ సినిమాలను కూడా హాలీవుడ్‌లో ప్రచారం చేసేలా చర్యలు తీసుకోవాలి. డిస్నీ కంపెనీ వాళ్లు వాళ్ల టెక్నాలజీని టాలీవుడ్‌కు అందించాలని కోరుకుంటున్నా" అని అన్నారు.


డిస్నీ సంస్థ ప్రతినిధి విక్రమ్ దుగ్గల్ మాట్లాడుతూ...
అల్లావుద్దీన్, అవేంజెర్స్ ఎండ్ గేమ్ మేము ఇటీవల అన్నీ ప్రాంతీయ భాషల్లో విడుదల చేశాము. ఎక్కువ శాతం సినీ అభిమానులు హాలీవుడ్ సినిమాను తమ ప్రాంతీయ భాషలో చూడ్డానికి ఇష్టపడుతున్నారు కావున టర్మినేటర్ డార్క్ ఫేట్ ను అన్నీ ప్రాంతీయ భాషల్లో విడుదల చేస్తున్నాము. ఈ చిత్ర ట్రైలర్ ను విడుదల చేసిన విజయ్ దేవరకొండకు ధన్యవాదాలు. నవంబర్ 2న విడుదల కానున్న టర్మినేటర్ డార్క్ ఫేట్ చిత్రం అన్ని భాషల్లో సక్సెస్ అవుతుందని భావిస్తున్నాను అన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: