టాలీవుడ్ లో నందమూరి ఫ్యామిలీ నుంచి సీనియర్ ఎన్టీఆర్ తర్వాత ఆయన తనయుడు నందమూరి బాలకృష్ణ బాలనటుడిగా పరిచయం అయ్యాడు. తర్వాత హీరోగా మారిన బాలకృష్ణ తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకున్నాడు.  తండ్రి లాగే ఎలాంటి పాత్రల్లో అయినా లీనమై నటించే బాలకృష్ణ ఆ మద్య ఫ్యాక్షన్ తరహా సినిమాలు ఎక్కువగా తీస్తూ వచ్చారు.  క్రిష్ దర్శకత్వంలో బాలకృష్ణ 100వ సినిమా ‘గౌతమి పుత్ర శాతకర్ణి’.  ఈ మూవీ తర్వాత డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథర్ దర్శకత్వంలో ‘పైసా వసూల్’ సినిమాలో నటించాడు. 

ఈ సినిమాలో బాలయ్య అంతకు ముందు ఎన్నడూ కనిపించని విధంగా కనిపించాడు.  మాస్ ప్రేక్షకులకు బాగా నచ్చినా..కమర్షియల్ హిట్ మాత్రం కాలేదు.  తర్వాత ఎన్టీఆర్ జీవిత కథ ఆధారంగా క్రిష్ దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా ‘ఎన్టీఆర్ కథానాయకుడు, ఎన్టీఆర్ మహానాయకుడు’ సినిమాల్లో నటించారు. కానీ, ఈ రెండు మూవీస్ అనుకున్న స్థాయిలో హిట్ కాలేదు. ఆ తర్వాత ఏపిలో ఎన్నికల బిజీలో మునిగిపోయారు బాలకృష్ణ. 

ఈ నేపథ్యంలో హిందూపుర్ నుంచి మరోసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. తర్వాత చాలా గ్యాప్ తీసుకున్న బాలయ్య,  కేఎస్ రవికుమార్ దర్శకత్వంలో ఒక యాక్షన్ ఎంటర్టైనర్ రూపొందుతోంది. సి.కల్యాణ్ నిర్మిస్తున్న ఈ సినిమాలో సోనాల్ చౌహన్.. వేదిక కథానాయికలుగా అలరించనున్నారు. కాగా, ఈ మూవీ కి 'రూలర్' అనే టైటిల్ ను పరిశీలిస్తున్నట్టుగా వార్తలు వచ్చాయి. కానీ అఫిషియల్ గా మాత్రం అనౌన్స్ మెంట్ చేయలేదు. 

మరింత సమాచారం తెలుసుకోండి: