ఏ ఇండస్ట్రీలో ఉన్నపుడు చాలా విమర్శలు తట్టుకోవాల్సి సమయం వస్తుంది. అలా తట్టుకున్నపుడే విజయం వస్తుంది అని అర్థం అవుతుంది. ఒకవేళ అపజయం వచ్చినా కూడా తట్టుకునే శక్తి ఉన్నపుడే కదా నిలబడే స్థైర్యం వస్తుంది. ఎందుకంటే ఒక్కసారి సినిమాల్లోకి వస్తున్నామంటే కచ్చితంగా చాలా వేళ్లు మన వైపు చూపించడానికి మన ముందు  సిద్ధంగానే ఉంటాయి.. ఇలాంటి అనుభవాలే సినిమా వాళ్లకు చాలా మందికి ఎదురవుతుంటాయి ఎప్పుడు. 


ప్రస్తుతం  తరుణ్ భాస్కర్ విషయంలో కూడా ఇదే జరిగింది. హాయిగా డైరెక్షన్ చేసుకోక నీకెందుకురా యాక్టింగ్.. అక్కడ అవకాశాలు లేవు కాబట్టి యాక్టింగ్ వైపు వచ్చావు కదా అంటూ తనను చాలా మంది విమర్శించారని అని తెలుపుతున్నాడు తరుణ్ భాస్కర్.


ప్రస్తుతం ఈయన విజయ్ దేరవకొండ నిర్మాతగా చేస్తున్న మీకు మాత్రమే చెప్తాలో హీరోగా నటిస్తున్నాడు. కొత్త దర్శకుడు షమ్మీర్ సుల్తాన్ ఈ సినిమాను తెర మీదకి తెస్తున్నాడు. త్వరలోనే విడుదలకు సిద్ధం అవుతుంది  ఈ చిత్రం. ఇదిలా ఉంటే ఇప్పుడు ప్రమోషన్స్‌లో భాగంగా తనకు ఎదురైన కొన్ని సంఘటనల గురించి తెలియచేసారు తరుణ్ భాస్కర్. దర్శకత్వం కాదని నటన వైపు వస్తున్నపుడు తనను తిట్టిన వాళ్లు కూడా  చచాల మంది ఉన్నారని.. తనకే కాదు అమ్మ విషయంలో కూడా ఇలాగే జరిగింది అని తెలిపాడు తరుణ్.


ఫిదాలో తన అమ్మకు నటించే అవకాశం వచ్చినపుడు.. మొగుడు పోయాడు.. విధవవు నీకెందుకు నటన అంటూ వెక్కిరించారూ.. హేళన చేసారని గుర్తు చేసాడు తరుణ్ భాస్కర్. తనపై కూడా ఇలాంటి కమెంట్స్ చేస్తున్నా కూడా పట్టించు కోవడం లేదు  ఈయన. తన భార్య, తల్లికి నచ్చితే మిగిలిన వాళ్లు ఏమనుకున్నా కూడా నాకు అవసరం లేదు అని అంటున్నాడు ఈయన. మొత్తానికి మీకు మాత్రమే చెప్తానంటూ హీరో అయిపోయాడు తరుణ్ భాస్కర్. ఈ సినిమాలో అనసూయ కూడా కీలక పాత్ర పోషిస్తుంది.



మరింత సమాచారం తెలుసుకోండి: