ఉయ్యాలవాడ వీరుడిగా బ్రిటిష్ వాళ్లకు చుక్కలు చూపించిన మెగాస్టార్ చిరంజీవి.. ఇక దేశం లోని అవినీతి పరులైన బడా రాజకీయ నాయకుల భరతం పట్టేందుకు సిద్ధం అవుతున్నాడు చిరు. ప్రస్తుతం ఈ అంశం ఫిలిం నగర్ సర్కిల్స్‌లో బాగా వైరల్గా  మారింది. అంటే చిరంజీవి మళ్ళీ రాజకీయాల వైపు అడుగులు వేస్తున్నారా? అనేగా మీ సందేహం. ఐతే  వివరాలు చూద్దామా మరి..


వరుసగా 149 సినిమాలు చేసి అశేష అభిమాన వర్గాన్ని దగ్గించుకున్న మెగాస్టార్ ఆ తరువాత రాజకీయ బాట పట్టిన సంగతి అందరికి తెలిసిందే. అయితే అనుకున స్థాయిలో రాజకీయాల్లో ఆదరణ లభించక పోవడంతో తిరిగి వెండితెర పైకి రీ ఎంట్రీ ఇచ్చాడు చిరంజీవి.. ఆసక్తికర కథాంశాలను ఎంచుకుంటూ సినిమాలు చేస్తూ ముందుకు పోతున్నారు.


ఇటీవలే సైరా నరసింహా రెడ్డి రూపంలో చారిత్రాక నేపథ్యమున్న సినిమాలో నటించిన చిరు.. ఇటీవలే కొరటాల శివతో తన 152 వ సినిమాను కూడా ప్రారంభించడం జరిగింది. సామాజిక అంశాలతో సినిమాలు తెరకెక్కించడంలో కొరటాలను మించిన డైరెక్టర్ టాలీవుడ్ లో లేడని చెప్పడంలో అతిశయోక్తి లేదు అని అంటున్నాడు చిరు. ఐతే  అదే బాటలో చిరంజీవి కోసం ఆయన ఓ అద్భుతమైన స్టోరీ రెడీ చేశారని తెలుస్తోంది.


రెండు తెలుగు రాష్ట్రాల్లోని దేవాలయాలలో జరుగుతున్న అవినీనీతిని కొరటాల టచ్ చేస్తూ ఈ సినిమా స్టోరీ సిద్ధం చేశారని సమాచారం ఉంది. చిత్రంలో చిరంజీవి దేవాదాయ శాఖ ఉద్యోగిగా నటించనున్నారనేది సమాచారం. దేవాదాయ శాఖ ఉద్యోగిగా పలు దేవాలయాల్లో జరుగుతున్న అవినీతిని వెలికితీసే పనిలో ఉంటారు అని చిరంజీవి పాత్ర.


కొరటాల సిద్ధం చేసిన కథ ప్రకారం.. దేవాలయాల్లో జరుగుతున్న అవినీతి, కుంభకోణాల్లో రాజకీయ నాయకుల హస్తం ఉంది అని తెలుస్తుంది. సదరు రాజకీయ నాయకుల భరతం పడుతూ దేవాదాయ షాక్ ఉద్యోగిగా చిరంజీవి రోల్ సినిమాలో హైలైట్ అయ్యేలా చేశారని కనిపిస్తుంది. నిజానికి కొరటాల- చిరంజీవి మూవీ ఎప్పుడో ఓకే అయింది. కానీ సైరా సినిమా షూటింగ్ కారణంగా ఈ సినిమా షూటింగ్ వాయిదా పడుతూ వచ్చింది అని అందరికి తెలిసిందే . ఇప్పడు సైరా పనులన్నీ ముగియడంతో చిరు ఫ్రీ అయ్యారు. సినిమాకి  సంబంధించిన ఇతర వివరాలు మరికొద్ది రోజుల్లోనే వెల్లడిస్తారు అని  చిత్రయూనిట్ తెలుపుతుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: