లేడీ సూపర్ స్టార్ నయనతారది విభిన్నమైన స్టైల్.  నయనతార గ్లామర్ డాల్ గానే కాకుండా నటనకు ప్రాధాన్యం ఉన్న బాపు చిత్రం శ్రీరామరాజ్యం'లో సీతగా నటించి, ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేసింది. ఈ సినిమాకు గాను 'ఫిల్మ్‌ఫేర్', 'నంది' అవార్డులు ఆమెను వెతుక్కుంటూ వచ్చాయి. తమిళం భాషలలో ఎన్నో సూపర్ హిట్ సినిమాలలో నటించిన ఆమెకు ఓ ప్రత్యేక వ్యక్తిత్వంతో కూడా గుర్తింపు ఉంది. తొలుత మళయాళ సినిమాలో నటించి సినిమా రంగంలోకి ప్రవేశించిన నయనతార.. ఆ తరువాత తెలుగు, తమిళంలో అగ్రహీరోలందరి సరసన నటించారు. 

ఇక ఇండస్ట్రీలో అజిత్, నయనతారల జంట నటన  ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయ్యాయి.  అజిత్, నయనతార  తమిళంలో బిల్లా, ఏగన్, విశ్వాసం మూడు చిత్రాల్లోనూ జంటగా నటించిన ఈ  జంట.... ‘బెస్ట్‌ పెయిర్‌’ అని కూడా అనిపించుకున్నారు.
అజిత్ తో కలసి పనిచేయాలన్నది  పలువురి  కధానాయికల కల. అజిత్ తో కలసి పనిచేయాలన్నది  పలువురి దర్శకుల ఆశ. ఒక్కసారి ఛాన్స్ వస్తే చాలు అనుకునేవాళ్లు చాలామంది. అలాంటిది  కోలీవుడ్  దర్శకుడు శివ, ఏకంగా నాలుగు సినిమాలు ఆయనతో తీశారు. ఇప్పుడు నాలుగోసారి ఈ జంట తెరపై కనిపించే అవకాశం ఉందని సమాచారం.

ఇప్పుడు దర్శకుడు  హెచ్ .వినోద్ కూడా ఆ అవకాశం అందిపుచ్చుకున్నారు. అజిత్‌ 60వ సినిమా త్వరలో ఆరంభం కానుంది. వినోద్‌ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని బోనీ కపూర్‌ నిర్మించనున్నారు. ఇందులో కథానాయికగా నయనతార అయితే బాగుంటుందని చిత్రబృందం భావించిందట. నయనతారను సంప్రదించారని కూడా సమాచారం. వరుస సినిమాలతో బిజీగా ఉన్న నయనతార, ఈ  సినిమాలో నటిస్తారోలేదో మనం వేచి చూడాల్సిందే. పేరు ఖరారు కానీ ఈ సినిమాలో శ్రీదేవి కుమార్తె జాన్వికపూర్ ఓ  ముఖ్యమైన పాత్ర  పోషిస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: