క్యాస్టింగ్ కౌచ్ అంటే సినిమా ఇండస్ట్రీలో ఉన్న చీకటి బాగోతం అన్న విషయం అందరికి తెలిసిందే. అవకాశాల ఇస్తామని నమ్మించి అమ్మాయిల్ని వాడుకుని వాళ్ళతో అవసరం తీర్చుకున్నాక వేషం ఇవ్వకుండా ముఖం చాటేయడమే ఈ క్యాస్టింగ్ కౌచ్ కాన్స్పెట్. గత కొంతకాలంగా ఈ వ్యవహారం ఇండస్ట్రీని కుదిపేస్తున్న విషయం కూడ అందరికి తెలిసిన విషయమే. ఇప్పుడు ఈ ఇష్యూపై సీనియర్ దర్శక, నిర్మాత ఘాటుగా స్పందించారు. ఒకరకంగా ఆయన మాటల్లో వాస్తవం ఉందని చెప్పక తప్పదు. తమకు సినిమాల్లో వేషాలు ఇవ్వడం లేదంటూ యూట్యూబ్‌లో వీడియోలు పోస్ట్ చేస్తూ రచ్చ చేస్తున్నఅమ్మాయిలకు తిరిగి కౌంటర్ ఇచ్చారు సీనియర్ దర్శక, నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ.   

ఈ మధ్య ఇంగ్లీష్ వెబ్ సిరీస్ కొన్ని చూశా... వాటితో పాటు యూట్యూబ్‌లో కూడా మాకు వేషాలు ఇవ్వడం లేదంటూ క్యాస్టింగ్ కౌచ్ బాధల్ని, ఇబ్బందులను చెప్పుకొస్తున్నారు కొంతమంది అమ్మాయిలు. వాళ్లకు న్యాయం జరగడం లేదన్నది నిజమే. నిజంగా అలాంటి అమ్మాయిలకు సపోర్ట్ చేయాల్సిందే. అయితే కొంత మంది మాకు వేషం ఇవ్వడం లేదంటారు. ఇంకొంతమంది ఆఫీస్‌కి రానివ్వడం లేదంటారు. అసలు 'క్యాస్టింగ్ కాల్' లేకుండా సినిమాలకు, ఆఫీస్‌లకు వాళ్లు ఎందుకు వెళ్తున్నారు? రాత్రి పూట సినిమాలకు ఆఫీస్‌లకు వెళ్లాల్సిన పని ఏంటి? ఇవన్నీ వాళ్లను అడిగితే మాకు అలవాటు అయిపోయింది.. మేం ఎప్పుడైనా ఆఫీస్‌లకు వెళ్లి వేషం అడుగుతాం. వాళ్లు ఆ టైంలో వెళ్తే వేషం ఇస్తారు అంటున్నారు. ఆ టైం లో వెళితే ఇచ్చే అవకాశం అవసరమా అని ఆయన అన్నారు. 

అసలు ఎవరు పిలవకుండా వేషాలు ఇస్తారనే నమ్మకం లేనప్పుడు ఆఫీసులకు వెళ్లకూడదు. తెలిసిన వ్యక్తులు, కంపెనీలు అయితే వెళ్లి అడిగినా పర్లేదు. ఇక పగలు వెళ్తే  సమస్యే  ఉండదు గాని ఇలా రాత్రిపూట వెళ్లడం, వేషం ఇవ్వలేదని ఆరోపించడం చాలామందికి కామన్‌ అయిపోయింది. క్యాస్టింగ్ కౌచ్ పేరుతో అమ్మాయిలకు వేషాలు ఇస్తానని వాళ్లను ఆఫీస్‌లకు రప్పించుకుని వాడుకోవడం పాపం, తప్పు. అటువంటి వాళ్లను ఖచ్చితంగా శిక్షించాల్సిందే. కాని వాడు సినిమా తీస్తున్నాడు కాబట్టి నాకు వేషం ఇవ్వాలనే హక్కు ఎవరికీ లేదు. సినిమా తీసేవాడి ఇష్టం. ఏ పాత్రకు ఎవరు సరిపోతారో వాళ్లకే వేషం ఇస్తారు. అది వాళ్ల ఇష్టం. వాళ్లు ఆఫీస్ పెట్టుకుంది సినిమా తీయడం కోసం తప్ప నీకు వేషం ఇవ్వడానికి కాదు...అంటు చాలా ఆసక్తికరంగా మాట్లాడారు. ముక్కుసూటిగా మాట్లాడినా అమ్మాయిలు జాగ్రత్తగా ఉండాలనే ఉద్దేశ్యం స్పష్టంగా తెలుస్తుంది. ఇది అర్థం చేసుకుంటే అందరికి, ముఖ్యంగా అమ్మాయిలకు చాలా మంచిది.   


మరింత సమాచారం తెలుసుకోండి: