ప్రస్తుతం తెలుగు టెలివిజన్ తెరపై మంచి జోష్ తో మరియు ప్రేక్షకాధరణతో సాగుతున్న షో బిగ్ బాస్ సీజన్ 3. మొదట్లో కొంత డల్ అయిన ఈ షోకు ప్రస్తుతం విపరీతమైన రేటింగ్స్ వస్తున్నట్లు సమాచారం. తొలి రెండు సీజన్లను మంచి ఊపుతో నడిపిన ఎన్టీఆర్ మరియు నానీలకు ఏ మాత్రం తీసిపోని విధంగా, ప్రస్తుతం కొనసాగుతున్న ఈ మూడవ సీజన్ ని కింగ్ అక్కినేని నాగార్జున తన ఆకట్టుకునే హోస్టింగ్ టాలెంట్ తో ముందుకు తీసుకెళ్తున్నారు. ఇప్పటికే షో మూడొంతులు పూర్తి అవడంతో ఫైనల్ విన్నర్ గా ఎవరు నిలుస్తారా అని ప్రేక్షకులు ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు. 

మరొక్క మూడు వారాలు మాత్రమే మిగిలి ఉన్న ఈ షోలో ప్రస్తుతం వరుణ్ , వితిక , రాహుల్ , శివజ్యోతి , బాబా మాస్టర్ , శ్రీముఖి , ఆలీ తదితర హౌస్ మేట్స్ మాత్రమే మిగిలి ఉండడంతో, వీరిలో ఎవరు విజేతగా నిలుస్తారో ఇప్పటికిప్పుడు చెప్పలేని పరిస్థితి. అయితే మరొక రెండు వారాల తరువాత వారానికి ఒక్కరు చొప్పున ఇద్దరు వెళ్లిపోవడంతో, ఆఖరి వారం మొత్తం ఐదుగురు మిగులుతారు. వారిలోనే అసలు విజేత ఎవరు అనేది నిర్ణయించబడుతుంది. అయితే ఫైనల్ విజేతగా ఎవరు నిలవబోతున్నారు అనే దానిపై నేడు బిగ్ బాస్ టీమ్ నుండి కొంత సమాచారం లీక్ అయినట్లు చెప్తున్నారు. అయితే వారు చెప్తున్న వివరాలను బట్టి ఫైనల్ విన్నర్ గా యాంకర్ శ్రీముఖి నిలిచే అవకాశం ఒకింత ఎక్కువగా ఉందట. 

ఇప్పటివరకు ఆడియన్స్ అందిస్తున్న ఓట్ల పరంగా అందరికంటే ముందుగా దూసుకెళ్తున్న శ్రీముఖి నే ఫైనల్ విన్నర్ అని అంటున్నారు. అయితే ఇది ఒట్టి ఫేక్ న్యూస్ అని కొట్టిపారేస్తున్న వారు కూడా లేకపోలేదు. ఇప్పటివరకు శ్రీముఖి నే అందరికంటే ముందు వరుసలో ఉండి ఉండవచ్చు, అలాగని మిగిలిన మూడువారాల్లో ఆమె కొనసాగుతుంది అనేది ఇప్పుడే చెప్పలేం కాబట్టి, ప్రస్తుతం బిగ్ బాస్ లీకుల పేరుతో, శ్రీముఖి నే విన్నర్ అంటూ వస్తున్న వార్తలు నమ్మశక్యం కానివని మరికొందరు కొట్టిపారేస్తున్నారు. ఈ వార్తలు, వాదనలు అన్ని ప్రక్కన పెట్టి, అసలు విజేత ఎవరో నిజంగా తేలాలంటే మాత్రం మరొక్క మూడు వారాలు ఓపిక పట్టాల్సిందే....!!


మరింత సమాచారం తెలుసుకోండి: