చిరంజీవి ప్రస్తుతం ఢిల్లీ వెళ్ళి అక్కడ ఉపరాష్ట్రపతికి తన ‘సైరా’ ను చూపెట్టి ప్రస్తుతం ప్రధానమంత్రి అపాయింట్ మెంట్ కోసం ఎదురు చూస్తున్నాడు. ఇలాంటి పరిస్థితులలో అదే కేంద్రప్రభుత్వానికి చెందిన జీఎస్టీ టాస్క్ ఫోర్స్ అధికారులు తూర్పు గోదావరి జిల్లాలో ప్రదర్శింప బడుతున్న అనేక ‘సైరా’ ధియేటర్స్ ను చెక్ చేసి ‘సైరా’ కలక్షన్స్ యదార్ధమేనా తమకు రావలసిన జీఎస్టీ సరిగ్గా జమ అయిందా లేదా అన్న విషయం లోతుగా విచారణ చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.

ఈ దాడులు కేవలం తూర్పుగోదావరి జిల్లాలో మాత్రమే జరిగాయా లేదంటే ‘సైరా’ ప్రదర్శిస్తున్న అన్ని ధియేటర్లలోను జరిగాయా అన్న విషయమై స్పష్టత లేదు. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం తమకు రావలసిన జీఎస్టీ విషయమై చాల గట్టిగా వసూలు చేస్తోంది. వాస్తవానికి సినిమా థియేటర్ల యాజమానులు జీఎస్టీని చెల్లించాల్సి ఉంటుంది. 

సినిమాను బయ్యర్లు కొనుగోలు చేసి ప్రదర్శిస్తారు కనుక ఆ జీఎస్టీని బయ్యర్లు చెల్లించాలి. ఇటీవల విడుదలైన సైరా చిత్రం భారీగా వసూళ్లు నమోదు చేసిన నేపథ్యంలో లెక్కలన్నీ పక్కాగా ఉన్నాయా జీఎస్టీ సరిగా చెల్లిస్తున్నారా అనే విషయాన్ని పరిశీలించేందుకు టాస్క్ ఫోర్స్ రంగంలోకి దిగింది. తెలుస్తున్న సమాచారం మేరకు ‘సైరా’ రైట్స్ అమ్మకం జరిగే సమయంలో బయ్యర్లు చేసుకున్న ఒప్పందం ప్రకారం జీఎస్టీ మొత్తాన్ని కూడా నిర్మాత రామ్ చరణ్ చెల్లిస్తానని ఒప్పుకున్నట్లు తెలుస్తోంది. 

ఈ మూవీకి బ్రేక్ ఈవెన్ వచ్చిన తర్వాత బయ్యర్లు జీఎస్టీని చెల్లించడానికి ఒప్పుకున్నారట. ‘సైరా’ కు తెలుగు రాష్ట్రాలలో కూడ ఇంకా బ్రేక్ ఈవెన్ రాకపోవడంతో ఈ మొత్తాన్ని చరణ్ చెల్లించ వలసి ఉంటుంది అని అంటున్నారు. తెలుగు రాష్ట్రాల్లో 100 కోట్లకు పైగా షేర్ వసూళ్లు అయినట్లు వార్తలు వస్తున్న  నేపథ్యంలో ఈ వార్తలే నిజం అయితే జీఎస్టీ భారీగానే చెల్లించవలసి ఉంటుంది. దీనితో ఈ మొత్తాన్ని చరణ్ చెల్లిస్తాడా లేక బయ్యర్లు చెల్లిస్తాడా అన్న విషయమై మరో కొత్త సమస్య చరణ్ కు ఏర్పడింది అనుకోవాలి..



మరింత సమాచారం తెలుసుకోండి: