మన లైఫ్ లో ఏదైనా ఎప్పుడైనా ఏవేవో జరుగుతుంటాయి. ఇకపోతే ఈ కాలంలో పెళ్ళాం లేకుండా ఎవరైనా ఉంటారుగాని, స్మార్ట్ ఫోన్ లేకుండా మాత్రం ఎవరు ఉండరు. ఏది మాత్రం సత్యం.. అయితే, ఆ ఫోన్ లో సీక్రెట్స్ ఉంటె అవి మీకు మాత్రమే చెప్తా అని ఎవరైనా అంటే ఆగరు.. అందులో ఎం లేకున్నా కూడా ఏదైనా ఉందేమో అని ఆసక్తిగా ఎదురు చూస్తారు. అలాంటి సీక్రెట్స్ మీకు చెప్తాను అంటూ పెళ్లి చూపులు ఫెమ్ దర్శకుడు
తరుణ్ భాస్కర్ నేను చెప్తాను అంటున్నాడు.
గతంలో
విజయ్ దేవరకొండతో కలిసి పెళ్లిచూపులు సినిమాలో నటించారు. ఆ సినిమా సక్సెస్ అవ్వడంతో ఆయనకు హీరోగా చేయాలనే కోరిక ఉందని అంటున్నారు. ఆ కోరికను ఇప్పడు
విజయ్ తీరుస్తున్నాడు.
తరుణ్ భాస్కర్ హీరోగా
విజయ్ నిర్మిస్తున్న సినిమా 'మీకు మాత్రమే చెప్తా'.. ఈ సినిమా మొత్తం కామెడీగా ఉంటుంది. నూతన దర్శకుడు షమీర్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు.
ఈ సినిమా ట్రైలర్ ను నిన్న తెలుగు సూపర్ స్టార్
మహేష్ బాబు రిలీజ్ చేశారు. ఈ ట్రైలర్ లాంచ్ కోసం ఒక పెద్ద ఈవెంట్ చేసి ముఖ్య అతిధిగా తెలుగు సూపర్ స్టార్
మహేష్ బాబు హాజరయ్యారు. ఈవెంట్లో హీరో
మహేష్ బాబుతో పాటు
విజయ్ దేవరకొండ,
ఆనంద్ దేవరకొండ,
తరుణ్ భాస్కర్, అనసూయ మొదలగు వారు విచ్చేసి సందడి చేశారు.
తరుణ్
భాస్కర్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో అవంతికా మిశ్రా హీరోయిన్ గా నటిస్తున్నారు.
తరుణ్ భాస్కర్, అభినవ్ గోమటం, అనసూయ భరద్వాజ్,
వాణి భోజన్,
పావని గంగిరెడ్డి, నవీన్ జార్జ్ థామస్ ప్రత్యేక పాత్రలో నటిస్తున్నారు. ఎనెర్జిటిక్ డైనమేట్ హీరో విజయ దేవరకొండ ఈ సినిమాకు నిర్మాతగా వ్యవహరించడం ఈ సినిమాకు ఓ హైప్ తీసుకురాగా, సూపర్ స్టార్
మహేష్ బాబు లాంటి పెద్ద స్టార్ ఈ సినిమా ట్రైలర్ ను రిలీజ్ చేయడం ఈ సినిమాకు మరో హైప్.. అయితే, సినిమా ఎలా ఉండబోతుందో చూడాలి..
https://www.youtube.com/embed/YoL7AEf7erQ