టాలీవుడ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా రెండేళ్ల క్రితం ప్రేక్షకుల ముందుకు వచ్చిన భారీ సినిమా బాహుబలి 2. అంతకముందు వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన బాహుబలి సినిమాకు సీక్వెల్ గా వచ్చిన ఈ సినిమా అప్పట్లో దేశవ్యాప్తంగా కొన్ని వందల కోట్ల రూపాయలు కలెక్ట్ చేసి, అత్యద్భుత రికార్డు ని నెలకొల్పింది. అంతేకాదు అప్పట్లో ఆ సినిమా థియేట్రికల్ ట్రైలర్ కు అత్యధిక యూట్యూబ్ వ్యూస్ మరియు లైక్స్ కూడా లభించడం జరిగింది. అయితే ఆ సినిమా వచ్చి ఇప్పటికే రెండేళ్లు గడవడంతో ఆ సినిమా పేరుతో ఉన్న యూట్యూబ్ వ్యూస్ రికార్డ్స్ ని ఇటీవల పలు సినిమాలు ఇప్పటికే తుడిచిపెట్టాయి. 

గత ఏడాది ప్రేక్షకుల ముందుకు వచ్చిన బాలీవుడ్ కింగ్ ఖాన్ అయిన షారుఖ్ నటించిన జీరో సినిమా ట్రైలర్ ఇప్పటివరకు మొత్తం మన దేశవ్యాప్తంగా రిలీజ్ అయిన సినిమాలన్నింటిలోకి అత్యధికంగా 1.9 మిలియన్ల లైక్స్ పొందిన ట్రైలర్ గా పెద్ద రికార్డు ని నెలకొల్పడం జరిగింది. ఇక ఇటీవల హృతిక్ రోషన్, టైగర్ ష్రాఫ్ ల కలయికలో వచ్చిన భారీ యాక్షన్ థ్రిల్లర్ మూవీ వార్, జీరో ట్రైలర్ రికార్డ్స్ ని క్రాస్ చేస్తుందని అందరూ భావించారు. అయితే ఆ సినిమా ట్రైలర్ కు బాగానే లైక్స్ వచ్చినప్పటికీ, అవి కేవలం 1.65 మిలియన్ల వద్ద మాత్రమే ఆగిపోయాయి. అయితే ఐదు రోజుల క్రితం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఇళయదళపతి విజయ్ నటించిన బిగిల్ సినిమా ట్రైలర్, ప్రస్తుతం యూట్యూబ్ దుమ్ముదులుపుతోంది. 

ఇప్పటివరకు ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్ 30 మిలియన్లకు పైగా వ్యూస్ తో పాటు, 2 మిలియన్ల లైక్స్ తో భారీ రికార్డ్స్ సాధిస్తూ ముందుకు సాగుతోంది. నిన్నటితో ఈ సినిమా ట్రైలర్ 2 మిలియన్ల లైక్స్ దక్కించుకుని మొత్తం ఇండియాలోనే అత్యధిక లైక్స్ పొందిన ట్రైలర్ గా అద్వితీయమైన తిరుగులేని రికార్డు ని నెలకొల్పింది. దీని పై విజయ్ ఫ్యాన్స్ విపరీతంగా ఆనందం వ్యక్తం చేస్తూ, సినిమా కూడా తప్పకుండా మంచి సక్సెస్ అవుతుంది అంటూ సోషల్ మీడియా మాధ్యమాల్లో సందడి చేస్తున్నారు. ఈ విధంగా బాహుబలి2, వార్, జీరో వంటి సినిమాల రికార్డ్స్ ని ఈజీగా తుడిచిపెట్టిన విజయ్ నటించిన బిగిల్ సినిమాపై తమిళనాడు వ్యాప్తంగా విపరీతమైన అంచనాలు నెలకొని ఉన్నాయి.....!!


మరింత సమాచారం తెలుసుకోండి: