బాలీవుడ్ తరువాత అతి పెద్ద సినీ పరిశ్రమగా ఉన్న టాలీవుడ్ ఇపుడు ఎటు వైపు పయనిస్తోందన్న సంగతి చూడాల్సివుంది. హిందీ చిత్రాలతో పోటీ పడడమే కాదు బాహుబలి లాంటి ఖండాంతర మూవీని కూడా ఇచ్చిన ఘన చరిత్ర టాలీవుడ్ ది. టాలీవుడ్లో ఉన్న టాప్ స్టార్స్ ఓవర్సీస్ లో సాధిస్తున్న విజయాలు అన్నీ ఇన్నీ కావు. యూనివర్సల్ అప్పీల్ కోసం టాలీవుడ్ పడుతున్న తాపత్రయం సూపర్ హిట్ అయిందన్న మాట వినిపిస్తున్న దశలో భారీ షాక్ తగిలింది. ఏంటది..


అంటే టాలీవుడ్ లో మెటీరియల్ అయిపోయిందని కాదు, సరుకు చాలానే ఉంది. కానీ వాడుకునే విధానం తెలియకనే వెలవెలబోతోంది.  బాహుబలి రాజమౌళి కి మాత్రమే సొంతమైన మ్యాజిక్. ఎందుచేతనంటే బాహుబలి కధ ఎవరికీ కొత్త కాదు అదొక చందమామ కధ. ఇక అందులో కనిపించే విన్యాసాలు అన్నీ కూడా బ్లాక్ అండ్ వైట్ లో తెలుగు ప్రేక్షకులకు విఠలాచార్య ఎపుడో చూపించేశారు. మరి బాహుబలి ఎలా బ్లాక్ బస్టర్ అయింది.


ఎలా అది యూనివర్సల్ గా సర్వామోదం అయింది అన్న ప్రశ్నలు వచ్చినపుడు ఒక్కటే సమాధానం. అదేంటి  అంటే బాహుబలి కధనం. గ్రాఫిక్స్, ఎక్కడా సడలని బిగి, జిగి వీటన్నిటి వెనక ఒక్కడే  ఉన్నాడు అదే రాజమౌళి. ఇక బాహుబలి మూవీ తీయడమే కాదు, మార్కెట్ ఎలా చేయాలో కూడా తెలిసిన వాడు రాజమౌళి. అందుకే బిగినింగ్ ఎక్కడా ఆపాలో అక్కడే ఆపాడు, మంచి రసపట్టు లో ఫస్ట్ పార్ట్ ముగించి కంక్లూషన్ కి ప్రాణం పోశాడు.


అందుకే బాహుబలి రెండు పార్టులూ సూపర్ హిట్ అయ్యాయి. బాహుబలిని చూసి చేతులు కాల్చుకున్న టాలీవుడ్ సైరా, సాహో అంటూ వెర్రి పరుగులు తీసింది. టాలీవుడ్ కాన్వాస్ పెరిగిందని కూడా భ్రమ పడింది. ఫలితం... చేదు అనుభవం. డిజాస్టర్ గా సాహో మిగిలితే సైరా తెలుగు వరకూ మాత్రం ఒకే అనిపించుకుంది.  ఈ మొత్తం ఏపిసోడ్ లో పాన్ ఇండియా మూవీ అన్ని గంగవెర్రులెత్తిన వారికి మరో భయంకర నిజం ఏంటి అంటే మన పొరుగున ఉన్న కర్నాటక, కేరళ మార్కెట్ టాలీవుడ్ కి ఇపుడు లేకుండా పోయింది. ఇంకోవైపు ఓవర్సీస్ దెబ్బ కూడా అలా ఇలా పడడంలేదు.


ఈ పరిణామాలను చూసినపుడు పాన్ ఇండియా అని పరుగులు తీయని రోజులే నయం అంటోంది టాలీవుడ్. అపుడు సౌత్ ఇండియాలోనైన తెలుగు సినిమా నిలబడింది. ఇపుడు మొత్తం పోయింది. ఓవర్సీస్ ఆశ కూడా నీరుకారింది. ఈ దశలో టాలీవుడ్ కి పెద్ద మార్కెట్ అంటూ ఏదీ లేకుండా పోయింది. మొత్తానికి పాన్ ఇండియా మోజు  చేతులు కాల్చేసింది.


మరింత సమాచారం తెలుసుకోండి: