హాలీవుడ్ సూపర్‌స్టార్ ఆర్నాల్డ్ స్క్వార్జెనెగర్ నటించిన టర్మినేటర్: డార్క్ ఫేట్ చిత్రం నవంబర్ 1 రిలీజ్‌కు ముస్తాబవుతున్నది. హాలీవుడ్ ప్రముఖుడు జేమ్స్ కామెరాన్ రూపొందించిన ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో రిలీజ్ చేస్తున్నారు. కాగా, తెలుగు వెర్షన్‌కు సంబంధించిన ట్రైలర్ ఆవిష్కరణ కార్యక్రమం హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ హోటల్‌లో జరిగింది.

ఈ కార్యక్రమానికి విజయ్ దేవరకొండ హాజరై ట్రైలర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా విజయ్ దేవరకొండ మాట్లాడుతూ..టర్మినేటర్: డార్క్ ఫేట్ చిత్రం ట్రైలర్ బాగుంది. టెక్నికల్‌గా చాలా అద్భుతంగా ఉంది. స్కూల్‌లో ఉన్నప్పుడు జేమ్స్ కామెరాన్ సినిమాలు చూశానుఅని విజయ్ దేవరకొండ అన్నారు.నా చిన్నతనంలో టర్మినేటర్ సినిమా చూశాను. నేను టర్మినేటర్ జడ్జిమెంట్ చూశాను.

ఆ సినిమాలో విలన్‌ను పోలీస్ ఆఫీసర్ ఎంత కాల్చినా వస్తూనే ఉంటాడు. పోలీస్ ఆఫీసర్‌ను వెంటాడుతుండే ఆ విలన్ చూసి తట్టుకోలేక సావురా.. సావురా.. వీడు ఎప్పుడు సస్తాడో అనే అంటూ మొత్తుకొనేవాళ్లం. . ఆ థ్రిల్ మాటల్లో చెప్పలేం. మళ్లీ నాకు బాల్యం గుర్తొచ్చింది. ఇప్పుడు టెర్మినేటర్: డార్క్ ఫేట్ సినిమా ట్రైలర్‌ను ఆవిష్కరించడం ఆనందంగా ఉంది.టెర్మినేటర్: జడ్జిమెంటల్ డే సినిమా తర్వాత నాకు బాగా నచ్చిన ట్రైలర్ టర్మినేటర్: డార్క్ ఫేట్ మాత్రమే. టెర్మినేటర్ సిరీస్లో ఇది ఐదోవది. హాలీవుడ్ డబ్బింగ్ సినిమా 300 చూశాను. ఎక్కువగా నేను ఇంగ్లీష్ వెర్షన్ చూసేవాడిని.

నా ఫ్రెండ్ కోసం తెలుగు డబ్బింగ్‌కు వెళ్లాల్సి వచ్చింది అన్నారు.టాలీవుడ్ సినిమాలను ఇంగ్లీష్‌లో డబ్బింగ్ చేసి అక్కడ కూడా ప్రమోట్ చేయాలి. సైరా, సాహో లాంటి సినిమాలు రూపొందితే ఇంగ్లీష్‌లో డబ్బింగ్ చేసి రిలీజ్ చేయాలి. ఏదో ఒకరోజు తెలుగు సినిమాలు అక్కడ ప్రమోట్ చేయాలి. ఆర్నాల్డ్ చేత విజయ్ దేవరకొండ వరల్డ్ ఫేమస్ లవర్ సినిమా చూడమని ప్రచారం చేయించాలి అని విజయ్ దేవరకొండ ఫన్నీగా మాట్లాడారు.


మరింత సమాచారం తెలుసుకోండి: