బాలీవుడ్ లో ఇప్పటి వరకు ఎంతో మంది స్టార్ హీరోల వారసులు హీరోలు గా వెండి తెరకు పరిచయం అయ్యారు.  ఒకప్పుడు హీరోగా నటించి తర్వాత విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించిన ఆదిత్య పాంచోలి తనయుడు సూరజ్ పాంచోలి హీరోగా నటిస్తున్న కొత్త సినిమా ‘శాటిలైట్‌ శంకర్‌’. ఇర్ఫాన్‌ కమల్‌ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో సూరజ్‌ సైనికుడిగా నటిస్తున్నారు. దేశ భక్తి ప్రధానంగా ఓ సైనికుడు చేసే సాహసోపేతమైన జర్నీ నేపథ్యంలో సినిమా సాగుతుందని తెలుస్తుంది.  ఈ మద్య కాలంలో దేశభక్తిపై ఎన్నో సినిమాలు వస్తున్నాయి.

ముఖ్యంగా కాశ్మీర్ 370 ఆర్టికల్ రద్దు తర్వాత పాక్ కుటిల రాజకీయాలు చేస్తున్న తరుణంలో భారత సైన్యం వాటన్నింటిని సమర్థవంతంగా తిప్పికొడుతుంది.  ఇదే సమయంలో సైనికుల గొప్పతనాన్ని ఎలిగెత్తి చాటులున్న సినిమాలకు మంచి ఆదరణ లభిస్తుంది. ఈ మద్య హృతిక్ రోషన్, టైగర్ ష్రాఫ్ మల్టీస్టారర్ మూవీ ‘వార్’ సైనికులకు, దేశభక్తికి సంబంధించి కావడం విశేషం.

'శాటిలైట్‌ శంకర్‌' మూవీ కూడా దేశ భక్తి ప్రధానంగా ఓ సైనికుడు చేసే సాహసోపేతమైన జర్నీ నేపథ్యంలో సినిమా సాగుతుందని తెలుస్తుంది. ఈ జర్నీ చేసే క్రమంలో అసలు వాస్తవాలను తానెలా తెలుసుకున్నాడనేది ఆసక్తికరంగా ఉంటుంద‌ట‌. ఈ సినిమాని న‌వంబ‌ర్ 15న‌ విడుదల చేయనున్నారు. సినిమాలో మేఘా ఆకాశ్ హీరోయిన్ గా నటిస్తుంది. 

సూరజ్ పాంచోలీ కుటుంబ నేపథ్యం మొత్తం సినీ పరిశ్రమకు చెందినవారు కావడం విశేషం. తల్లిదండ్రులు ఇద్దరు నటులు, తాత ఫిలిమ్ మేకర్ కావడంతో చిన్ననాటి నుంచి హీరో అవ్వాలనే కోరికతో అన్నింటిలో శిక్షణ తీసుకున్నాడు సూరజ్ పాంచోలి. ఈ సినిమాపై సూరజ్ పంచోలి భారీ ఆశలు పెట్టుకున్నారు. దేశ భక్తి నేపథ్యంలో వస్తున్న సినిమా కావడంతో ఈ సినిమా విజయం సాధించడం ఖాయమని బాలీవుడ్ వర్గాలు పేర్కొంటున్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: